Chaysam first photo as a married couple | పెళ్లయ్యాక ఫస్ట్ ఫోటో పోస్ట్ చేశారు

Chaysam social media viral pics

Samantha Ruth Prabhu, Naga Chaitanya, Married Couple Photo, Chaysam After Marriage, Prathyusha Foundation Doctor Manjula, Chaysam Manjula

Samantha Ruth Prabhu and Naga Chaitanya’s first picture after the two-day wedding event is here. Chaysam first photo as a married couple. The newly-weds are seen posing with Prathyusha Foundation Doctor Manjula

పెళ్లయ్యాక ఫస్ట్ ఫోటో షేర్ చేసిన చై-సామ్

Posted: 10/09/2017 06:48 PM IST
Chaysam social media viral pics

రెండు రోజుల క్రితం సినీన‌టులు నాగచైతన్య, సమంత వివాహం హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల్లో సింపుల్‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే హైదరాబాద్‌లో వీరి పెళ్లి రిసెప్షన్‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయిన త‌రువాత ఈ జంట దిగిన ఓ ఫొటో ఫేస్‌బుక్‌లో వైర‌ల్ గా మారింది.

వారిద్ద‌రు ప్రత్యూష ఆర్గనైజేషన్ డాక్ట‌ర్‌ మంజులతో ఫొటో దిగారు. కొత్త పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు దుస్తుల్లో చిరున‌వ్వు చిందిస్తూ ఉంది. మెడ‌లో మంగళసూత్రం కూడా క‌న‌ప‌డుతోంది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లకు మీడియా కవరేజ్ హడావుడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి టాప్ హీరో ఫ్యామిలీ అయిన అక్కినేని వారిది ఇంకెలా ఉండాలి? అయినప్పటికీ చాలా చాలా సింపుల్ గా ఏ హడావుడి లేకుండా జరిగిపోయింది.

అయినప్పటికీ తమ పెళ్లికి సంబంధించి అన్ని ఫోటోలను ఈ కపుల్ షేర్ చేస్తూ వైరల్ చేస్తోంది. జాతీయ మీడియా కూడా పెళ్లయ్యి రెండు రోజులు గడిచాక కూడా ఆ టాపిక్ ను వదలటం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొద్ది రోజలు వేకేషన్ తర్వాత వీళ్లిద్దరూ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga Chaitanya  సమంత  నాగ చైతన్య  

Other Articles