Mahanubhavudu Not Malayalam Movie Remake | మహానుభావుడు ఆ సినిమా కాపీనా? ఛస్...

Maruthi on mahanubhavudu copy marks

Director Maruthi, Mahanubhavudu Movie, North 24 Kaatham Mahanubhavudu, Mahanubhavudu Malayalam Remake

Director Maruthi on Mahanubhavudu Copy Marks. Malayalam Movie North 24 Kaatham Story different from this Maruthi Added.

మహానుభావుడు కాపీ కాదు: మారుతి

Posted: 09/19/2017 06:13 PM IST
Maruthi on mahanubhavudu copy marks

భలే భలే మగాడివోయ్ తో స్టార్ హీరోలను డైరక్టర్ చేసే రేంజ్ కి వెళ్లిపోయిన మారుతి.. తన తర్వాతి చిత్రం బాబు బంగారంతో కంప్లీట్ గా ఢీలా పడిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ డైరక్టర్ ఆశలన్నీ మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా పైనే. పెద్ద చిత్రాల మధ్య పోటీ నడుమ 29వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి
ట్రైలర్ ను వదలగా.. అది బాగానే ఆకట్టుకుంది.

హీరో అతిశుభ్రత అనే వ్యాధితో బాధపడుతున్న కాన్సెప్ట్ ను ట్రైలర్ లో చూపించారు. అయితే ఇది ఓ సౌత్ సినిమాకు కాపీలా ఉందన్న విషయాన్ని పలువురు తెరపైకి తెస్తున్నారు. 2013లో ఫాహద్ ఫాజిల్ .. స్వాతి రెడ్డి జంటగా మళయాళంలో ఓ చిత్రం వచ్చింది. 'నార్త్ 24 కాథమ్'గా వచ్చిన చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా కాన్సెప్ట్ దాదాపు 'మహానుభావుడు' సేమ్ ఉన్నాయంటూ చర్చించుకుంటున్నారు.

దీనిపై దర్శకుడు మారుతి స్పందించాడు. అతిశుభ్రత అనే కథాంశంతో పలు భాషల్లో కూడా చిత్రాలు వచ్చాయని.. అంత మాత్రాన పోలిక పెట్టడం సరికాదని ఆయన అంటున్నారు. మహానుభావుడు చిత్రానికి ఏ చిత్రంతో పోలిక ఉండదని.. ఈ చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles