Posani talks About Night Shootings | రాత్రి షూటింగ్ ల గురించి పోసాని టాక్

Posani about movie offers

Posani Krishna Murali, Posani Paisa Vasool, Paisa Vasool Posani, Posani Night Shootings, Posani Tollywood Movie Offers

Posani Krishna Murali Latest Interview. He Talks Not Encouraging Night Shootings Because of Health Problems. Thats is The Reason he lost Big Movie Offers including Paisa Vasool.

ఆఫర్లు తగ్గిపోవటంపై పోసాని మాట

Posted: 09/18/2017 05:36 PM IST
Posani about movie offers

రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా రాణించిన పోసాని కృష్ణమురళి ప్రస్తుతం నటుడిగానే చాలా బిజీ అయిపోయారు. ఆయన ఎంపిక చేసుకుంటున్న పాత్రలు .. ఆయన నటనలోని వైవిధ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మధ్య ఎందుకో నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటున్న ఆయన.. మళ్లీ రచయితగా మారబోతున్నారా? అని ప్రశ్నిస్తే... చివరి రోజుల్లో ఆత్రేయ లాంటి గొప్ప రచయితకే దుర్గతి పట్టిందని.. అలాంటి పరిస్థితి తనకు రావొద్దని కోరుకుంటున్నట్లు చాలా ఓపెన్ గా చెప్పాడు.

ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్య పైసా వసూల్ చిత్రం వదులుకోవటంపై స్పందించాడు. ప్రస్తుతం ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తొద్దన్న ఉద్దేశ్యంతోనే తాను కొన్ని సినిమాలు వదులుకుంటున్నానని చెప్పుకొచ్చారు. రాత్రి సమయాల్లో షూటింగ్ ఉంటే తాను ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత సేపైనా షూటింగులో పాల్గొనడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారు. కానీ, నైట్ మాత్రం నో షూటింగ్ అని చెబుతున్నారు. ఎంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోదలచుకోలేదన్నారు.

అయితే ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఈ కారణంగా కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవలసి వచ్చిందని చెప్పారు. అలా బాలకృష్ణ పైసా వసూల్ చిత్రం కూడా వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నాడు. అంటే సినిమాలో థర్టీ ఇయర్స్ పృథ్వీ చేయాల్సిన పాత్రను పోసాని చేయాల్సి ఉందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles