Bigg Boss Success Formula Not Worked for Two Heroes | బిగ్ బాస్ పాపం ఆ ఇద్దరికీ మాత్రం అచ్చీ రాలేదు

Bigg boss not work for those heroes

NTR, Bigg Boss Show, Allari Naresh, Meda Mida Abbayi, Sunil, Ungarala Rambabu, Bigg Boss Show Allari Naresh Naresh

Bigg Boss Success Mantra Not Works for Sunil and Allari Naresh. Both Serial Failure Heroes participate in Bigg Boss show. But, Meda mida Abbayi and Ungarala Rambabu Fails at Box Office.

బిగ్ బాస్ వాళ్లకు మాత్రం కలిసి రాలేదు

Posted: 09/16/2017 06:09 PM IST
Bigg boss not work for those heroes

బుల్లితెరలో పాపులర్ అయిన బిగ్ బాస్ క్రేజ్ ను వాడుకుని తమ సినిమాలను చాలా మందే ప్రమోట్ చేసుకున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రిలీజ్ కి ముందు రానా .. 'ఆనందో బ్రహ్మ' సమయంలో తాప్సీ .. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లారు. ఈ మూడు సినిమాలు హిట్ కావడంతో, విడుదలకి ముందు ఆయా హీరోలు 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లడమనేది సెంటిమెంట్ గా మారింది.

ముఖ్యంగా వీకెండ్స్ లో ఎన్టీఆర్ హోస్టింగ్ గా ఉంటున్న సమయంలో టీఆర్పీ .. వ్యూవర్స్ ఎక్కువగా ఉండటంతో ఈ కార్యక్రమానికి కొత్త సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఈ షో ఒక వేదికగా నిలిచిందనే సంగతి తెలిసిందే. అయితే గత వారం రిలీజ్ అయిన రెండు చిత్రాల విషయంలోనే ఈ వ్యవహారం తేడా కొట్టింది. 'మేడ మీద అబ్బాయి' కోసం అల్లరి నరేశ్ .. 'ఉంగరాల రాంబాబు' కోసం సునీల్ కూడా 'బిగ్ బాస్' హౌస్ లో అడుగుపెట్టారు. ఇద్దరూ కూడా వరుస ఫెయిల్యూర్స్ తో సతమత మవుతున్న హీరోలే. దీంతో ఎలాగైనా హిట్ తగులుతుందేమోనన్న ప్రయత్నంగా హౌజ్ కు వచ్చారు.

అయితే వీరి విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాలో దమ్ము ఉంటేనే హిట్ అవుతుందన్న మ్యాటర్ తేలిపోయిందన్న మాట. అన్నట్లు త్వరలో జై లవ కుశ హీరోయిన్లు బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Bigg Boss Show  ఎన్టీఆర్  బిగ్ బాస్ షో  

Other Articles