Jyothika in Mani Ratnam Bilingual Movie.

Suriya wife in mani sir movie

Mani Ratnam, Actress Jyothika, Dumm Dumm Dumm Movie, Aishwarya Raajesh, Hero Nani, Bilingual Movie

Mani Ratnam New Movie Heroines Confirmed. Beside Aishwarya Rajesh, Jyothika Plays Crucial Role in Mani Ratnam Movie. Rumoured That Nani Also In the Part of Mani's Project.

మణి సర్ చిత్రంలో జ్యోతిక.. నాని కూడానా?

Posted: 09/08/2017 04:44 PM IST
Suriya wife in mani sir movie

కోలీవుడ్ నటి జ్యోతిక రీఎంట్రీలో ఆసక్తికరమైన కథలనే ఎంచుకుంటుంది. 36 వయధినిలే తో రీఎంట్రీ ఇచ్చిన జో అందులో గృహిణి రోల్ తో విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మగళియార్ మట్టమ్ వచ్చే వారం రిలీజ్ కు రెడీ అయిపోతుంది. దీనికి నిర్మాత నటుడు సూర్యనే కావటం విశేషం.

ఇలా భర్త సూర్య సపోర్ట్ తో దూసుకుపోతున్న జ్యోతిక త్వరలో మరో సీనియర్ దర్శకుడి చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. చెలియా డిజాస్టర్ తో రామ్ చరణ్ సినిమా అటకెక్కటంతో డమ్ డమ్ డమ్ అనే ఓ సినిమాను పట్టాలెక్కించే ఫ్లాన్ లో ఉన్నాడు ఈ క్లాసిక్ డైరక్టర్ మణిరత్నం. త్వరలో తీయబోతున్న ఓ చిత్రంలో జ్యోతిక ఓకే అయిందని తెలుస్తోంది. ఓ కీలకమైన పాత్ర ఆమెను వెతుక్కుంటూ రావటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే చెప్పేసినట్టు సమాచారం.

ఇక ఇంకో విశేషం ఏంటంటే.. ఈ బైలింగువల్ మూవీలో నాని కూడా ఓ రోల్ పోషించబోతున్నాడని. ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ ఇందులో మరో హీరోయిన్ గా తీసేసుకున్నారంట. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం జ్యోతిక బాల దర్శకత్వంలో 'నాచ్చియార్' అనే సినిమా చేస్తోంది. ఇందులో యంగ్ మ్యూజిక్ డైరక్టర్, హీరో జీవీ ప్రకాశ్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ యేడాది చివర్లోనే నాచ్చియార్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles