టాలీవుడ్ లో తనయుల ఫీవర్ కొనసాగుతోంది. రానున్న రెండేళ్లలో వరుస బెట్టి వారసుల డెబ్యూ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రవితేజ తనయుడు మహదేవన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ హల్ చల్ చేస్తోంది. బాల నటుడిగానే తండ్రి హీరోగా నటిస్తున్న చిత్రం రాజా ది గ్రేట్ ద్వారా మాస్ రాజా కొడుకు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. రానున్న రోజుల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించబోతున్నాడన్నది స్పష్టం అయిపోతుంది.
ఇక సగం హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ.. మెచ్యూర్డ్ హీరోగా కనిపించేందుకు రెడీ అయిపోతున్నాడు. తన దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందని పూరీ ఇప్పటికే స్పష్టం చేశాడు కూడా. ఆకాశ్ బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించటమే కాదు.. ఆ మధ్య ఆంధ్రాపోరి అంటూ ఓ సినిమాలో హీరోగా చేశాడు కూడా.
చివరగా చెప్పుకోవాల్సింది నందమూరి వారసుడు మోక్షజ్న గురించి.. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలోనే బాలకృష్ణ తనయుడి ఆరంగ్రేటం ఉంటుందని చెప్పుకున్నాం. కానీ, ఇంకా టైముందంటూ బాలయ్య అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మధ్య పైసా వసూల్ ప్రమోషన్ టైంలో వచ్చే ఏడాదే తన వారసుడి ఎంట్రీ ఉంటుందంటూ చెప్పేశాడు. జూన్ నెలలో వీలైతే తన పుట్టిన రోజే కొడుకు లాంఛ్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. మోక్షజ్న లుక్ కు సంబంధించి ఓ ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది. డీసెంట్ లుక్కుతో ఉన్న నందమూరి వారసుడు.. రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఏలటం ఖాయమనే బాలయ్య ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
వీళ్లే కాదు.. పవన్ వారసుడు అకీరా.. మహేష్ తనయుడు గౌతమ్(వన్ నేనోక్కడినే).. బన్నీ కొడుకు అయాన్.. ఎన్టీఆర్ పుత్రరత్నం అభయ్.. చిన్నతనంలోనే వారి వారి వారసులను తమ చిత్రాల ద్వారానే ఆరంగ్రేటం చేయించేందుకు సిద్ధమైపోతున్నారు. వీరితో శివాజీ రాజా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ పిల్లలను సినిమాల్లోకి తెచ్చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more