బిగ్ బీ వైఫ్ మళ్లీ అదే పని.. కుర్రాడిపై ఎలా ఫైర్ అయ్యిందో చూడండి | Enraged Jaya Bachchan bashes fan for taking selfies

Jaya bachchan lashes on fan at ganpati pandal

Jaya Bachchan, Jaya Bachchan Fire at Fans, Jaya Bachchan Angry, Jaya Bachchan Again Did It, Jaya Bachchan Serious, Jaya Bachchan fan Selfie

Jaya Bachchan Snapping At A Fan Trying To Take Selfies With Her. Jaya Lashes Out him and Called as Stupid.

సెల్ఫీ ఫ్యాన్ పై జయ బచ్చన్ ఫైర్

Posted: 08/30/2017 04:57 PM IST
Jaya bachchan lashes on fan at ganpati pandal

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వైఫ్ జయా బచ్చన్ మరోసారి తన దుందుడుకు స్వభావాన్ని చూపించారు. ఫ్యాన్స్ తో వివాదాస్పద వైఖరి ప్రదర్శించే ఆమె మరోసారి అదే పని చేశారు. తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ అభిమానిపై ఫైర్ అయ్యారు.

ముంబైలోని మహా గణపతిని దర్శించుకునేందుకు ఆమె ఓ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ఆమెతో ఫోటోల కోసం యత్నిస్తూనే ఉన్నాడు. ఇది గమనించిన జయా కాసేపు ఏం అనకుండా ఉండిపోయింది. చివరకు కారు ఎక్కేముందు కొన్ని క్షణాలపాటు అతనిపై కోపంగా చూశారు. ఆ తర్వాత 'అలా చేయకు.. స్టుపిడ్ ' అంటూ మందలించారు. గతంలో కూడా ఒక ఆలయంలో జయ ఇదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ పూజారి ప్రయత్నించాడు. దీంతో జయ, 'సెల్ఫీ కాదు... పూజపై దృష్టి పెట్టండి' అని చెప్పారు.

 

ఈ మధ్యే ఓ కాలేజీ ఆవరణలో జరిగిన పంక్షన్ వెళ్లిన ఆమె అక్కడి విద్యార్థులపై కూడా ఫైర్ అయ్యింది. ఆ మధ్య కుటుంబంతో వెళ్తున్న సమయంలో ఎగబడిన మీడియాపై కూడా ఫైర్ అయ్యింది. ఇలా కెమెరా ముందు నోరు జారటం ఆమెకు అలవాటుగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Bachchan  Stupid Comments  Selfie Fan  

Other Articles