స్టార్ హీరోతో నాని నిర్మాతగా ఓ సినిమా? | Nani To Produce Star Hero with Short Film Director

Nani again turn as producer

Nani Producer, Nani Producing Movie, Nani New Movie, Nani Prashanth Varma, Nani Second Movie Producing, Nani Short Film Director

Hero Nani Again turn Producer for New Movie. With His Busy Schedule another Star Hero May Act in that.

మళ్లీ నిర్మాతగా నేచురల్ స్టార్

Posted: 08/29/2017 03:27 PM IST
Nani again turn as producer

నేచురల్ స్టార్ నాని మరో మూడేళ్ల దాకా కాల్షీట్ ఖాళీగా లేకుండా నింపేసుకున్నాడు. ప్రస్తుతం ఎంసీఏ షూటింగ్ దశలో ఉండగా, తర్వాత కృష్టార్జునయుద్ధంతో రెడీగా ఉన్నాడు. మరోపక్క అవసరాలతో ఓ సినిమా, మరో యంగ్ డైరక్టర్ తో మరో కమిట్ మెంట్ ను ఇచ్చి ఉన్నాడు.

ఈ నేపథ్యంలో నాని మరోసారి నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. ఇంతకు ముందు డైలాగ్ ఇన్ ద డార్క్ వంటి పాపులర్ షార్ట్ ఫిల్మ్స్ తీసింది ఇతనే. నిజానికి నానినే ఈ సినిమాలో హీరోగా చేద్దామని అనుకున్నాడంట. అయితే వరుస కమిట్ మెంట్లతో సినిమాను ప్రోడ్యూస్ చేసేందుకు రెడీ అయిపోయాడు.

ఓ స్టార్ హీరోను ఈ సినిమా కోసం సంప్రదించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రీ ప్రోడక్షన్ పనులు ప్రారంభించి, చిత్రాన్ని మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో నాని డి ఫర్ దోపిడీ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Nani  Producer Avatar  Prashanth Varma  

Other Articles