సిగ్గున్నదా రా బై... వర్మకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చిన వీహెచ్ | Vulgar Varma Warned by Congress Senior Leader

Vh warns ram gopal varma

Ram Gopal Varma V Hanumantha Rao, VH RGV, Arjun Reddy kissing poster controversy, V Hanumantha Rao Vijay Devarakonda, RGV VH Comments

RGV takes a dig at Congress leader Hanumantha Rao over Arjun Reddy kissing poster controversy. Later Congress Senior Leader Seriously warned Varma over Vulgar Comments on Him.

వర్మకు వీహెచ్ సీరియస్ వార్నింగ్

Posted: 08/24/2017 09:41 AM IST
Vh warns ram gopal varma

సెన్సార్ అండ్ బోర్డుపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే రాంగోపాల్ వర్మ రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమా వివాదంలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. లిప్ లాక్ పోస్టర్లపై తీవ్ర దుమారం రేగటం, వాటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేయటంతో ఆర్జీవీ సపోర్ట్ గా నిలిచాడు.

వివాదానికి కారకుడైన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావును ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడు. వీహెచ్ బట్టలు చించి రోడ్డున నిలబెట్టాలంటూ చిత్ర హీరో విజయ్ దేవరకొండకు సూచించటమే కాదు, పిల్లలు భయపడతారేమోనని భయంగా ఉందంటూ పోస్టులు చేశాడు. ఆపై తాతయ్య అంటూ వెటకారంగా మరిన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో తనపై, తాను చేసిన పనిపై విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ తీరును కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్రంగా దుయ్యబట్టారు.

"సిగ్గున్నదారా బై...నువ్వసలు దర్శకునివేనా?...సమాజానికి ఇట్లాంటివి చెబుతావా? తాతయ్య మనవడి దగ్గరకు వెళ్లి, బాబూ ముద్దెట్ల బెడతవురా? అని నేర్చుకోవాలా? తాతయ్యకు తెలియదారా? బై...సినిమాలు అమ్ముకోవడమే లక్ష్యమా? సమాజం, విలువలు, సంస్కారం వంటివి లేవా? పనిలేక ఇలాంటివన్నీ చెబుతున్నవా? మంచి సినిమాలు తీసి సమాజ ఉన్నతికి పాటుపడాలి కానీ, ఇలాంటివి సమర్థిస్తవా?" అని తీవ్రంగా మందలించారు. నీకు సినిమాలు తియ్యనికి చేతకాకపోతే గమ్మున కూర్చోవాలని ఆయన సూచించారు. పని లేక ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు.

అశ్లీల దృశ్యాల పోస్టర్లను బాహాటంగా ప్రదర్శించడమే కాకుండా, దానిని సమర్థించడ మేమిటంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతుకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మకు సరైన సమయంలో బుద్ధి చెబుతామంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  V Hanumantha Rao  Arjun Reddy Kiss Poster  

Other Articles