పవన్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో? | Power Star's Independence Day gift to his fans

Pawan 25th movie first look date fix

Power Star Trikvikram Movie First Look, Pawan Trivikram First Look, Pawan Trivikram First Look, Pawan Independence Day Gift, PSPK 25 Movie, PSPK 25 First Look, Pawan Kalyan First Look

Powerstar Pawan Kalyan and Trivikram Srinivas is back for the third time after delivering blockbusters like ‘Jalsa’ and ‘Atharintiki Daredi.’ With success written all over, the crazy combo of Pawan and Trivikram has helped the movie in generating a huge pre-release business. As per the latest reports, the makers are planning to unveil the first look poster on 14th August as an Independence day gift.

పవన్ 25 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్సయ్యిందా?

Posted: 08/04/2017 05:06 PM IST
Pawan 25th movie first look date fix

పవన్ 25వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనా ఇంతవరకూ ఫస్టు లుక్ బయటికి రాకపోవడంతో, దాని కోసం పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందిస్తోంది చిత్ర యూనిట్.

ఆగస్టు 14న అంటే స్వాతంత్ర్య దినోత్సవం ముందు రోజే ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా పవన్ కి దేశభక్తి ఎక్కువే. అందువలన ఆ రోజున లుక్ ను వదలడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడట. త్వరలో ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ లోగా టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? .. ఒక్క లుక్ మాత్రమే వదులుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కీర్తి సురేష్, అనూ ఇమ్యానుయేల్ హీరోయిన్లుగా ఆది పినిశెట్టి, కుష్బూ కీలకపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  25th Movie  First Look  

Other Articles