కష్టాల్లో ఉన్న ‘కిన్నెర’ కు ఎలాంటి సాయం చేశాడో తెలుసా? | Another Angle in Posani Krishnamurali

Posani help kinnera mallaiah

Posani Krishna Murali, Kinnera Mallaiah, Posani Help, Posani Helping Nature, Posani Help Telangana Artist, Kinnera Metla Mallaiah, Pannendu Metla Kinnera, Melta Kinnera Artist Posani, Financial Help Kinnera Metla, Posani Request KCR

Tollywood Actor and Writer Posani Krishna Murali help Kinnera Mallaiah. Metla Kinnera Mallaiah belongs to Mahbubnagar suffers with financial trouble lived in a slum in Hyderabad.

కిన్నెర కన్నీరుకు పోసాని స్పందన.. మల్లయ్యకు ఆర్థిక సాయం

Posted: 08/02/2017 02:52 PM IST
Posani help kinnera mallaiah

పోసాని కృష్ణమురళి తన సినిమా మెంటల్ కృష్ణలో క్యారెక్టర్ కు చాలా దగ్గరగానే ఆయన స్వభావం ఉంటుందని చాలా మంది అంటుంటారు. అంతేకాదు పలు ఇంటర్వ్యూలలో ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే అదే కరెక్టేమో అనిపిస్తుంది కూడా. కానీ, మాటల్లో మాత్రం చాలా నిజాయితీ పరుడన్న విషయం ఒప్పుకుని తీరాలి. అందుకే ఈ రాజాకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గౌరవం ఇస్తుంటారు.

కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన కష్టాల్లో ఉన్న వాళ్లను చూస్తే అస్సలు తట్టుకోలేరు. చలించిపోవటమే కాదు, ఆలస్యం చేయకుండా వారికి చేతనైనంత సాయం చేస్తుంటారు. తాజాగా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆయన రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా తిండికి, బట్టకు ఏ లోటు వచ్చినా, తాను ఆదుకుంటానని చెప్పారు.

మొగులయ్య గురించి ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైన కథనం ద్వారా తెలుసుకున్న ఆయన... సదరు ఛానల్ ద్వారా మొగులయ్య వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ... కళాకారులకు నిలయంగా ఉన్న ఫిలింనగర్ లో 500గజాల స్థలంలో మొగులయ్యకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మొగులయ్య లాంటి కళాకారులను ప్రోత్సహిస్తే.. అంతరించిపోతున్న కిన్నెర మెట్ల వాయిద్యాన్ని మరో 100మందికి నేర్పించగలరని అన్నారు. కాగా, గతంలో 52దేశాల ప్రతినిధులను తన కిన్నెర వాయిద్యంతో ఉర్రూతలుగించారు మొగులయ్య. ఈరోజుల్లో 12మెట్ల కిన్నెర వాయిద్యంతో గానం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మొగులయ్య కావడం విశేషం.

మరోవైపు బిగ్ బాస్ లో తనకు వచ్చిన సొమ్ములో కొంత భాగంను నటి జ్యోతి, కాన్సర్ తో బాధపడుతున్న అల్లరి ఫేమ్ నటి సుభాషిణికి అందజేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani Krishna Murali  Melta Kinnera Artist  Mallaiah  Financial Help  

Other Articles