సునీల్ ఫేట్ ఇక దిల్ రాజు చేతిలోనే... | Comedian Turned Hero Future In Dil Raju Hands

Dil raju may grab sunil next rights

Ungarala Rambabu, Ungarala Rambabu Dil Raju, Dil Raju Sunil, Sunil Fate Movie, Ungarala Rambabu Dil Raju, Dil Raju, Dil Raju Sunil Movie Distribution, Dil Raju Decision

Top producer and Distributor Dil Raju to bail out the film Ungarala Rambabu. With no buyers, it is quite difficult for the film to hit the screens. Dil Raju will be watching the film soon after which he will take a call. The makers are in plans to release Ungarala Rambabu on August 18th all over.

దిల్ రాజు చేతికే సునీల్ మూవీ రైట్స్?

Posted: 07/31/2017 01:10 PM IST
Dil raju may grab sunil next rights

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయ్యాక సునీల్ గత కొంత కాలంగా వరుసగా ఫెయిల్యూర్స్ ను చవిచూస్తూనే ఉన్నాడు. పూర్ కంటెంట్ సినిమాలతో మెప్పించకలేకపోతున్నాడని ఆడియన్స్ తరపున కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్ఛితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆశలన్నీ రాబోయే చిత్రం ఉంగరాల రాంబాబుపైనే పెట్టుకున్నాడు.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కావటంతో కంటెంట్ పరంగా బాగానే ఉంటుందని ఆశించిన వారికి చిత్ర ట్రైలర్ పెద్ద షాకే ఇచ్చింది. గత కొన్నేళ్లుగా సునీల్ తీస్తూ వస్తున్న తరహా చిత్రాల్లాగే అనిపించటంతో మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో సినిమా పూర్తయి రెండు నెలలుకావస్తున్నా.. బయ్యర్లు ముందుకు రాకపోవటంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. దీంతో దిల్ రాజువైపు నిర్మాతలు ఆశగా చూస్తున్నారు.

రాజు పంపిణీదారుడిగా ఉన్నాడంటే చిత్రంలో ఏదో ఖచ్ఛితంగా కంటెంట్ ఉండి తీరుతుందన్న నమ్మకం ఆడియన్స్ లో కలుగుతుంది. అందుకే త్వరలో రాజు కోసం తమ సినిమా ఓ స్పెషల్ షో వేసేందుకు మేకర్లు రెడీ అయిపోతున్నారు. ఇంతకు ముందు యూనైటెడ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన వాటిని ఈ స్టార్ ప్రోడ్యూసరే రిలీజ్ చేశాడు. దీంతో రాంబాబుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే నిర్మాతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అన్ని సక్రమంగా జరిగితే ఆగష్టు 18న ఉంగరాల రాంబాబు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Ungarala Rambabu  

Other Articles