సిట్ ఆఫీస్ దగ్గర ఛార్మీ.. ఓవరాక్షన్.. జుట్టు పీకించుకుని విగ్గుపెట్టుకుందా? | Charmi Over Action in front of Media at SIT office

Actress charmi reached sit office for drugs case probe

Actress Charmi, Charmi Wig, Actress Charmi SIT Office, Charmi Over Action SIT Office, Charmi sing Wig, Actress Charmi Hair Removed, Charmi SIT Probe, Charmi Attend SIT Inquiry, Charmi Drug Case

Actress Charmi Attended SIT Interrogation in Drugs Case. Overaction at SIT Office. Whether She Use Hair Wig to avoid test.

సిట్ ముందుకు ఛార్మీ.. రేపు కూడా విచారణ?

Posted: 07/26/2017 11:24 AM IST
Actress charmi reached sit office for drugs case probe

డ్రగ్స్ కేసులో విచారణ కోసం సినిమా షూటింగ్ లో పాల్గొని అటునుంచి అటే సిట్ కార్యాలయానికి సినీ నటి ఛార్మి చేరుకుంది. ఇప్పటిదాకా హాజరైన ఆరుగురు సెలబ్రిటీలు కూడా వైట్ లో దర్శనమివ్వగా, ఛార్మీ మాత్రం బ్లూ డ్రెస్ లో వచ్చేసింది. ఏదో ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లినట్లు హడావుడి, ఆమె బౌన్సర్లు కంట్రోల్ చేస్తూ సీన్లు దర్శనమివ్వటం కొసమెరుపు. మీడియాకు అభివాదం చేసిన అనంతరం మహిళా పోలీసు అధికారులు ఆమెను లోపలకు తీసుకెవెళ్లారు.

ఇక నవదీప్ తర్వాత ఛార్మీయే కీలకమని అధికారులు భావిస్తున్నారు. కెల్విన్ ఫోన్ లో ఛార్మి పేరును 'ఛార్మి దాదా'గా ఫీడ్ చేసుకోవడం, వాట్సాఫ్ ఛాటింగ్ పై సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టు సమాచారం. జ్యోతిలక్ష్మి ఆడియో వేడుకలో కెల్విన్ తో క్లోజ్ గా సెల్ఫీలు ఛార్మికి మంచి సంబంధాలు ఉండే ఉంటాయని అనుకుంటున్నారు. హైకోర్టు సూచనల మేరకే ఆమెను విచారించే అవకాశం ఉంది.  బలవంతంగా బ్లడ్ తీసుకోవద్దన్న నేపథ్యంలో జుట్టు, గోళ్లు సేకరించే ఛాన్స్ ఉండటంతో ఆమె విగ్గు ధరించి వచ్చిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందని ఛార్మీ తరపు లాయర్ చెబుతున్నాడు.

ఇక ఛార్మిని ఎంక్వైరీ చేసే వారిలో ఓ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారిణితో పాటు మరో ముగ్గురు మహిళా సీఐలు ఈ బృందంలో ఉంటారు. అయితే, గతంలో నార్కోటిక్స్ కేసులో అనుభవమున్న మహిళా సీఐ ధనలక్ష్మి, ప్రధానంగా చార్మిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అకున్ సూచనల మేరకే మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆమెను సిట్ అధికారంలోకి దించిందంట. ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆమె, ఉన్నతాధికారులతో కూర్చుని, చార్మికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, సంధించాల్సిన ప్రశ్నల గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే, రేపు మరోసారి విచారిస్తామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Charmi  SIT Probe  Tollywood  Drug Case  

Other Articles