రిలీజ్ కు ముందే అక్కీకి షాక్.. ఎవరి పని? | Bollywood Star Hero Movie Leaked Before Release

Toilet ek prema katha movie leaked online

Toilet Ek Prem Katha, Toilet Ek Prem Katha Lekaed, Akshay Kumar Movie Leaked, Movie Leak Before Release, Akshay Kumar Piracy, Bollywood Piracy, Star Hero Movie Leak

Toilet Ek Prem Katha leaked, confirms Remo D'Souza. Akshay Kumar asks fans to say no to Piracy.

విడుదలకు ముందే లీకైన అక్కీ టాయ్ లెట్

Posted: 07/22/2017 11:13 AM IST
Toilet ek prema katha movie leaked online

పైరసీ భూతం తారాస్థాయికి చేరింది. సినిమా రిలీజ్ కు దాదాపు 20 రోజుల ముందే లీక్ కావటం సంచలనం రేపుతోంది. స్టార్ హీరో నటించిన ఈ చిత్రాన్ని ఓ స్టార్ కొరియోగ్రఫర్ చెప్పటంతోనే వెలుగులోకి వచ్చింది. ఇదంతా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన టాయ్ లెట్ సినిమా లీక్ వ్యవహారం గురించే...

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన టాయ్ లెట్ ఏక్ ప్రేమ కథ చిత్రం ఆగష్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఈ చిత్రం నెట్ లో కనిపించటం కలకలం రేపుతోంది. కొరియోగ్రఫర్ రెమో డిసౌజా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కు అందించి అప్రమత్తం చేశాడు. ‘‘ఓ వ్యక్తి తనతో తన దగ్గర సినిమా ఉందని చెప్పాడు. నేను మొదట ఆ విషయం నమ్మలేదు. అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేసి చూశా. అందులో టాయ్ లెట్ సినిమా ఉంది. నమ్మలేకపోయా.. షాక్ కి గురయ్యా! వెంటనే విషయాన్ని అక్కీకి చెప్పేందుకు యత్నించా. కానీ, అతను లండన్ లో ఉన్నాడని తెలిసింది. దీంతో నిర్మాత ప్రేమ్ ఆరోరా, దర్శకుడు శ్రీ నారాయణ సింగ్ కు చెప్పటంతో వాళ్లు ఆ పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు.

దీనిపై అక్షయ్ కుమార్ స్పందించాడు. పైరసీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు. మేకర్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతోమూడు వారాల ముందుగానే ఇలా నెట్ లో లీక్ కావటంపై కారణాలను అన్వేషించే పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. స్వచ్ఛ భారత్ ప్రేరణతో టాయ్ లెట్ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాకు అక్కీతోపాటు నీరజ్ పాండే సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toilet Ek Prem Katha  Movie Leak  Akshay Kumar  

Other Articles