సుబ్బరాజు పేర్లు చెప్పాడు.. విచారిస్తారా? | Top Family Names Revealed by Subba Raju

Subbaraju reveal celeb names

SIT Probe, Subbaraju, Actor Subba Raju Reveals Names, Subbaraju Puri Names, Hyderabad Drug Racket, SIT Pub Owners Meet, SIT Inquiry

Hyderabad drug racket Tollywood actor Subbaraju reveals more names in SIT probe. More Names yet to be out SIT may send notices to

సుబ్బరాజు నుంచి సిట్ అంత లాగిందా?

Posted: 07/22/2017 09:59 AM IST
Subbaraju reveal celeb names

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో మరో కీలక టర్న్ చోటు చేసుకుంది. సుబ్బరాజు విచారణలో మరికొందరి పేర్లు వెల్లడైనట్లు సమాచారం. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయటంతో ఒకానోక దశలో బీపీ డౌన్ అయి పడిపోగా, వైద్యులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా వదలని సిట్ విచారణను పూర్తి చేసే క్రమంలో ఒక్కో పేర్లు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. మ‌రొక సినీ ఫ్యామిలీ పేరు ముఖ్యంగా వెల్లడైందని సమాచారం.

ద‌శాబ్దాలుగా ఉన్న ఓ సినీకుటుంబంలోని ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు సోమవారం లేక మంగళ వారం రోజున ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు వెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు. సుబ్బరాజు చెప్పటంతోనే వారి పేర్లు వెల్లడి కాగా, ఇంకా కొంద‌రి సినీన‌టుల పేర్లు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. లిస్ట్ లో సినీ ప్ర‌ముఖుల పేర్ల‌ను ప‌రిశీలిస్తోన్న అధికారులు వాటికి గ‌ల ఆధారాల‌కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

మొత్తం సుబ్బరాజు చెప్పిన 15 పేర్లలో ఆ ఇద్దరు వారసులతోపాటు, ఓ ప్రముఖ హీరోయిన్, ఫేడవుట్ అయిన హీరోయిన్, వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉన్న ఓ హీరో, ఈ మధ్య డెబ్యూ చేసి బొక్క బోర్లా పడ్డ ఓ యంగ్ స్టర్, ఓ మేల్ అండ్ ఫిమేల్ యాంకర్లు, సైడ్ రోల్స్ చేసే ఇద్దరు నటులు, ఓ నటి, ఫారిన్ నుంచి వచ్చిన ఇద్దరు ఐటెం భామలు, ఓ పాపులర్ రైటర్ ఇలా ఉన్నట్లు భోగట్టా. వీరంతా కెల్విన్ తో పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నవారేనని, వీరికి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి నుంచే డ్రగ్స్ సరఫరా అయ్యిందని తేలటంతో సిట్ విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIT Probe  Subbaraju  Star Celebs  

Other Articles