కిడ్నీ కోరికతో కపూర్ హీరోయిన్ కు షాక్ | Heroine Shocks with Fan Asked for Bizarre Autograph

Shradda shocked with fan desire

Shraddha Kapoor, Shraddha Kapoor Fan, Shraddha Kapoor Kidney Autograph, Shraddha Kapoor Fan, Shraddha Kapoor Reject Autograph, Shraddha Kapoor Fan Shocks

Bollywood Actress Shraddha Kapoor Was Asked For Autograph On A Fan's Kidney. But, she gives only on paper.

ఫ్యాన్స్ తో ఛాట్.. శ్రద్ధా షాక్

Posted: 07/21/2017 02:34 PM IST
Shradda shocked with fan desire

బాలీవుడ్ లో విలనిజం కమ్ కామెడీ ని పండించిన నటుడు శక్తి కపూర్ వారసురాలిగా అడుగుపెట్టిన శ్రద్ధాకపూర్ తక్కువ టైంలోనే మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే శ్రద్ధ నటన కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. అయితే మధ్యలో అఫైర్లు, వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ ను కాస్త మసకబార్చినప్పటికీ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలతో పేరు సంపాదించుకునే పనిలో బిజీగా ఉంది.

ప్రస్తుతం ఆమె నటించిన హసీనా పార్కర్ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దావూద్ ఇబ్రహీం చెల్లి అయిన హసీనా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతూ ఛాట్ చేసింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో శ్రద్ధ షాక్ తినేసింది.

త‌న ఎడ‌మ‌ కిడ్నీపై శ్ర‌ద్ధాక‌పూర్‌ ఆటోగ్రాఫ్ కావాల‌ని ఓ అభిమాని ఆమెను అడిగాడు. దీంతో షాక్ తిన్న శ్రద్ధాక‌పూర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత సారీ... పేప‌ర్ మీద మాత్ర‌మే ఇస్తాన‌ని చెప్పేసి ఆ మ్యాటర్ ను అక్కడితోనే కట్ చేసింది. ఇక ఆమె నటిస్తున్న‘హసీనా: ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’సినిమా వ‌చ్చేనెల‌ 18న విడుద‌ల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Kapoor  Fan Chat  Kidney Autograph  

Other Articles