Telugu artistes gets Deadline to appear before Excise SIT

Media hints on telugu celebs involved in drug racket

Telangana, Excise SIT, Tollywood Actors, Tollywood Drug Mafia, Tollywood Names in Drug Dealing, Died Actor and Music Director Drug Dealing, Kelvin Drug Mafia, Kelvin Tollywood Names,

Top Telugu actors, directors get notices for alleged links with drug Racket. Media Hints on Telugu Celebs Involved. Gets July 19 deadline to appear before SIT

డ్రగ్ సినీ ప్రముఖల లిస్ట్.. ఎందుకు చెబుతున్నారసలు?

Posted: 07/14/2017 08:55 AM IST
Media hints on telugu celebs involved in drug racket

పెను కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్ కు టాలీవుడ్ లింకులు వెలుగులోకి రాగా కలవరపాటు మొదలైంది. టాలీవుడ్ లో 20 మందికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని ఎక్సైజ్ విభాగం గుర్తించింది. ఇందులో 15 మందిని విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. ఇలా నోటీసులందుకున్నవారి వివరాలను మీడియాకు ఉప్పందించి ఎవరన్నదానిపై అనుమనాలు వ్యక్తం అవుతుండగా, హింట్ లతో సహా వారెవరో చెప్పకనే చెప్పేస్తున్నాయి కొన్ని మీడియా ఛానెళ్లు.

సినిమాల్లో మంచి బ్రేక్ రాక సెకెండ్ హీరోగా స్థిరపడ్డ నటుడు, బాలనటుడిగా మొదలై హీరోగా నటించి, సినిమాల్లేని యువనటుడు, వర్థమాన గాయకురాలి భర్త, సినిమా ఫంక్షన్స్ లో హీరోలను ఆకాశానికి ఎత్తే ఒక నిర్మాత, సినిమాలు వేగంగా తీస్తాడని పేరున్న దర్శకుడు, డైరెక్టర్లతో బాగా క్లోజ్ గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసే ఒక హీరోయిన్, ఐటెం సాంగ్స్ తో వెండితెరను ఊపేసిన ఒకప్పటి నటి, మాస్ సినిమాలతో పేరు తెచ్చుకుని ఇప్పుడు ఫాంలో లేని ఒక హీరోకు డ్రగ్స్ నిత్యం సరఫరా చేస్తున్నట్టు కెల్విన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ తీసుకునే సినీ నటులందరికీ గచ్చిబౌలిలోని ఒక పబ్ అడ్డా అని అధికారులు గుర్తించి అక్కడి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోపక్క టాలీవుడ్ లో మృతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్, నటుడికి తానే డ్రగ్స్ ఇచ్చినట్టు కెల్విన్ పెద్ద బాంబే పేల్చాడు. వారిద్దరికీ నిత్యం డ్రగ్స్ సరఫరా చేశానని వెల్లడించాడు. ఈ నెల 19 నుంచి 25 తేదీ వరకు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లను విచారణ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుండగా, వారు ఎవరన్న దానిని బయటపెట్టేందుకు కొన్ని మీడియా సంస్థలు సిద్ధమైపోతున్నాయి. ఒక్కరి పేరు గనుక బయటకు వస్తే మాత్రం మిగతా వాళ్ల చిట్టా కూడా ఆటోమేటిక్ గా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Celebs  Drug Mafia  Excise SIT Notices  

Other Articles