Slaman Onscreen Aunt sentenced 2 years of Imprisonment

Bollywood actress booked under cheque bounce case

Bajrangi Bhaijaan fame Alka Kaushal, Salman Aunt Arrested, Salman Actress Arrested, Bajrangi Bhaijaan Actress Cheating Case, Cheque Bounce case Actress, Bollywood Serial Actress Cheque Bounce Case, Salman Aunt Money Laundering Case

Bajrangi Bhaijaan fame Alka Kaushal and her mother sent to jail for two years for money laundering.Alka Kaushal to play a Godwoman in &TV's Santoshi Maa

మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి అరెస్ట్

Posted: 07/10/2017 03:49 PM IST
Bollywood actress booked under cheque bounce case

మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి అల్కా కౌశల్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మలేర్ కోట్ల కోర్టు తీర్పు ఇచ్చింది. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'భజిరంగీ భాయిజాన్'లో కరీనా కపూర్ తల్లి రోల్ లో కనిపించింది ఈమె. అంతేకాదు స్వరగిణి, కుబూల్ హై లాంటి పలు టాప్ టీవీ సీరియల్స్ల్ తోపాటు సంతోషి మాత పాత్రలో ఓ సీరియల్ లో నటిస్తూ అలరిస్తూ వస్తోంది.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్వీన్' చిత్రంలో ఆమెకు తల్లిగా అల్కా కౌశల్ నటించింది. అవతార్ సింగ్ అనే రైతు నుంచి రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారు అల్కా, ఆమె తల్లి స్టేజీ నటి అయిన విశ్వ మోహన్ బదోలా. డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన వేళ, రూ. 25 లక్షల చొప్పున రెండు చెక్కులు ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయి. దీనిపై అవతార్ కేసు వేయగా, సంగ్ రూర్ కోర్టు 2015లో రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆపై అల్కా ఆ తీర్పును పైకోర్టులో అపీలు చేయగా, కింది కోర్టు తీర్పునే ఖరారు చేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.

దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. ఓ సీరియల్ కోసమే వాళ్లు ఆ డబ్బును డిమాండ్ చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ పద్మన్ లో సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Actress Alka Kaushal  Cheque Bounce Case  

Other Articles