Another Star Actress Roped for Nag Raju Gari Gadhi 2

Kajal s guest role in raju gari gadhi 2

Nagarjuna, Nagarjuna Kajal, Raju Gari Gadhi 2, Kajal Raju Gari Gadhi 2, Nag Kajal, Kajal with Senior Hero, Kajal 2017 Tollywood Movies, Samantha Kajal Nagarjuna, Kajal Samantha Movies

Nagarjuna woos for Kajal Agarwal for Raju Gari Gadhi 2. Not Yet Confirmed

నాగ్ కాజల్ నూ వదలట్లేదా?

Posted: 07/08/2017 01:12 PM IST
Kajal s guest role in raju gari gadhi 2

పదేళ్లకు పైగా కెరీర్ లో 50కి పైగా సినిమాలు.. ఇప్పుడున్న హీరోయిన్లకు ఇది కాస్త కష్టమయిన పనే. కానీ, కాజల్ మాత్రం అది పూర్తి చేసి థర్టీ ఫ్లస్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ యేడాది ఖైదీతో చిరుతో జత కట్టిన చందమామ ఇప్పుడు రానాతో నేనే రాజు నేనే మంత్రిలో ఓ రేంజ్ లోనే రొమాన్స్ పండించబోతుందని తెలుస్తోంది.

ఇప్పుడు సౌత్ లో కాజల్ కోలీవుడ్ లో మరో మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో విజయ్ సినిమా కూడా ఒకటి. అయితే తెలుగులో ఇప్పటిదాకా సీనియర్లలో మెగాస్టార్ తో మాత్రమే కాజల్ జోడికట్టింది. ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో కనిపించబోతుందని సమాచారం. అక్కినేని నాగార్జున అప్ కమింగ్ మూవీలో కాజల్ ఓ పాత్ర చేయబోతుందని టాక్.

నాగ్ రాజుగారి గది-2 లో సీరత్ కపూర్ ఓ హీరోయిన్ కాగా, సమంత ఇప్పటికే ఓ ముఖ్యపాత్ర చేయబోతుంది. ఇప్పుడు ఆ సినిమాలో కాజల్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచుతోందంట. 10 రోజుల షూటింగ్ లో పాల్గొనేసిందని కూడా లీక్ అందుతోంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal  Nagarjuna  Raju Gari Gadhi 2  

Other Articles