మల్టీ స్టారర్ ట్రెండ్ కు మళ్లీ టాలీవుడ్ లో కొత్త ఊపు వచ్చింది. భలే మంచి రోజుతో హిట్ కొట్టిన యంగ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణితో మళ్లీ హైలెట్ అవుతున్నాడు. నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది మరియు సుధీర్ బాబు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెయిన్ రోల్స్ తో ఈ సస్పెన్స్ డ్రామా తెరకెక్కింది.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా అంచనాలను భారీగానే పెంచేసింది. ఐదు కోట్ల విలువైన శమంతకమణి అనే కారును ఓ పోలీసాఫీసర్ తో సహా ఐదుగురు వ్యక్తులు టార్గెట్ చేయటం, వారిలో ఎవరు దొంగిలించారో తెలీక సస్పెన్స్ డ్రామాతో మూవీని తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం భారీగానే ఫ్లాన్ చేయబోతుంది నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్.
నందమూరి బాలకృష్ణతో ఈ సినిమాను ప్రమోట్ చేయించేందుకు రెడీ అయిపోతున్నారు. పైసా వసూల్ ఫారిన్ షెడ్యూల్ ముగించుకుని తిరిగొచ్చిన బాలయ్య ను కలిసిన నారా రోహిత్ ఈ విషయంపై చర్చించగా, ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య శమంతకమణి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతున్నాడన్న మాట. జూలైలోనే శమంతకమణి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more