Weak Weekend Collections for Salman Tubelight

Tubelight poor collections

Salman Khan, Tubelight Collections, Tubelight Weekend Collections, Tubelight Salman, Salman Weak Weekend Collections, Salman Poor Eid Collections, Salman Khan Lowest Collections, Tubelight Disaster

Salman Khan's First Weekend Collections of Tubelight. Lowest for Salman Khan's Eid release in last 6 years. Just earned 66 crores in 4 Days.

సల్మాన్ దెబ్బ.. కోలుకోవటం కష్టమే!

Posted: 06/27/2017 05:17 PM IST
Tubelight poor collections

కెరీర్ లో ఇంత వరకు లేని విధంగా సల్మాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది. వరుస బ్లాక్ బస్టర్ల ఊపులో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేద్దామని భావించి, కబీర్ ఖాన్ తో ముచ్చటగా మూడోసారి జతకట్టిన సల్మాన్ ఖాతాలో డిజాస్టర్ పడింది. జయహో తరువాత ఐదేళ్లకు సల్మాన్ ఖాతాలో అట్టర్ ఫ్లాప్ నమోదైంది. సల్మాన్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ సరైన కథలేకపోవడంతో ఈ రిజల్ట్ పడిందని తొలిరోజే రివ్యూలు తేల్చేశాయి.

మరోపక్క సల్మాన్ కెరీర్ లో ఎన్నడూ లేనంత తక్కువ వసూళ్లు తొలిరోజు నమోదయ్యాయి. కేవలం 21 కోట్లతో కండల వీరుడు సరిపెట్టుకున్నాడు. అలాగే తొలి వీకెండ్ వసూళ్లు కూడా కేవలం 66 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. గత ఐదేళ్లలో సల్మాన్ సినిమాకు అతితక్కువ వసూళ్లు ఈ సినిమాకే వచ్చాయి. శని, ఆది, సోమవారం (రంజాన్) వరుసగా సెలవులు వచ్చినప్పటికీ, దీనిని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాపైందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి.

సినిమా నష్టాల బారి నుంచి బయటపడాలంటే దాదాపు 300 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ, సినిమా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 120 కోట్ల వసూళ్లు కూడా కష్టమేనని వారు పేర్కొంటున్నారు. దీంతో సల్మాన్ ఏ రేంజ్ నష్టాలు మిగులుస్తుందోనని అంచనా కూడా వేయలేమని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Tubelight Movie  Weekend Collections  

Other Articles