Samantha with Scenic and Anasuya with Sign Board

Rc 11 rare photos viral on internet

Samantha, Samantha RC 11, Samantha Scenic Click, Samantha Ram Charan Sukumar Movie, Samantha Sukumar Movie, Samantha Art Photo, Sukumar Movie, Anasuya Ram Charan Movie

Samantha shared a scenic click from the sets of the movie which is now trending across the social media. Anasuya tweeted with Shooting Spot Board.

చెర్రీ మూవీ.. శామ్ అలా.. అనసూయ ఇలా...

Posted: 06/26/2017 03:03 PM IST
Rc 11 rare photos viral on internet

ఓవైపు బుల్లితెర షోలు, మరోవైపు మధ్య మధ్య లో సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు. ఇలా సాగిపోతూ వస్తోంది హాట్ యాంకర్ అనసూయ ప్రస్థానం. మధ్య మధ్య లో చేసే స్పైసీ ఫోటో షూట్ లతో తనపై అటెన్సన్ ను డైవర్ట్ కానీయకుండా చేస్తోంది. విన్నర్ లో ఐటెం సాంగ్ అంతగా ప్రయోజనం చేకూర్చనప్పటికీ ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో మాత్రం బంఫరాఫర్ కొట్టేసిన విషయం తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం 'రంగస్థలం 1985'లో నటించే ఛాన్స్ ను కొట్టేసిందని ఆ మధ్య చెప్పుకున్నాం. అయితే ఈ మధ్య సెట్ లో జాయిన్ అయ్యే దాకా వాళ్ల ఛాన్సులు
ఉంటున్నాయో? పోతున్నాయో? తెలీని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో తాను ఇన్ అంటూ స్వయంగా ధృవీకరించింది అనసూయ. 'రంగస్థలం' షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో నటీనటులకు స్వాగతం అంటూ ఉన్న ఫ్లెక్సీ ఫొటోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది.

దీంతో, ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుందా? అన్న కొత్త అనుమానాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. మరోపక్క సమంత కూడా తన ఇన్ స్టాలో ఓ ఫోటో ఉంచింది. ఆర్ట్ ఫోటో లాగా ఆ ఫోటోలో జానపద గేయాల్లో బుట్టబొమ్మలా కూర్చుని ఉంది. దూరంగా కొండల మధ్య సూర్యాస్తమయం ఎలా ఉందో మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Ram Charan  Sukumar Movie  

Other Articles