Chiru's Uyyalawada Ground Work started

Chiranjeevi team surveys uyyalawada village

Chiranjeevi, Uyyalawada Movie, Chiru Team Uyyalawada village, Uyyalawada Village Chiranjeevi, Uyyalawada Village Graphics, Uyyalawada Graphics

Makers of Chiranjeevi's upcoming film work on recreating Uyyalawada village.

ఉయ్యలవాడ.. జస్ట్ గ్రాఫిక్సేనా?

Posted: 06/24/2017 02:24 PM IST
Chiranjeevi team surveys uyyalawada village

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యలవాడ నరసింహరెడ్డి షూటింగ్ త్వరలో త్వరలో అంటూ ఇప్పటికే రెండు నెలలు దాటేసింది. కనీసం ముహుర్తం లాంఛ్ గురించి కూడా ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు చిత్ర నిర్మాత రాంచరణ్. స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటూ దర్శకుడు సురేందర్ రెడ్డిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త వాళ్లకు సంతోషాన్ని ఇస్తోంది.

మొన్నామధ్యే ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గడ్డెం మీసాలు పెంచేసిన చిరు షూటింగ్ కు రెడీ అయిపోతున్నట్లు సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహరెడ్డి స్వస్థలం కర్నూల్ కాగా, ఆయన ఊళ్లో ప్రస్తుతం చిత్ర యూనిట్ కొన్ని లోకేషన్లను ఫోటోలు, వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు సురేందర్ రెడ్డి, రైటర్స్ పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలోని బృందం ఆ టూర్ లో ఉయ్యలవాడ బంధువులను, ఊళ్లో ఉన్న పెద్దలను కలుసుకుని మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారంట. ఆయనకు ఇంటికి సంబంధించి నమునాలు సేకరించి సరిగ్గా అలాంటి సెట్ ను గ్రాఫిక్స్ లో రూపొందించే పనిని వీఎప్ ఎక్స్ టీంకు ఇప్పటికే అప్పగించాడంట చెర్రీ. ఉయ్యలవాడకు సంబంధించి ఏ చిన్నపాయింట్ ను కూడా మిస్ కాకుండా చూడాలన్న తాపత్రయమే సినిమా డిలేకు కారణమని స్పష్టమౌతోంది. ఓ ప్రముఖ ఫిజికల్ ట్రైనర్ ఆధర్వ్యంలో చిరు ఫిట్ అయ్యే యత్నంలో ఉన్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uyyalawada Movie  Chiranjeevi  Graphics Set  

Other Articles