Hero Ready to do Another Movie with Flop Director

Jayam ravi loose confident on vanamagan success

Jayam Ravi, Jayam Ravi Next Movie, Jayam Ravi AL Vijay, Jayam Ravi Offer to Vijay, Jayam ravi Vanamagan, Vanamagan Movie, Vanamagan Flop, Hero Flop Director Offer

Jayam Ravi appreciates Director Vijay Effort for Vanamagan. If Movie fails he do next movie with no remuneration.

ఫ్లాప్ అయినా సరే విజయ్ కు మరో ఛాన్స్!

Posted: 06/21/2017 04:30 PM IST
Jayam ravi loose confident on vanamagan success

భారీ హంగులు, సెట్లు, వీఎఫ్ఎక్స్ అంటూ వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు ఇప్పటి నిర్మాతలు. సినిమా హిట్ అయితే లాభాల పంటే. అయితే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. కోలీవుడ్ లో విజయ్ పులి ఈ బాపతు సినిమానే. బాహుబలి ఇన్సిపిరేషన్ అంటూ ఓ నాసిరకం సినిమాను అందించి విమర్శల పాలయ్యాడు దర్శకుడు చింబుదేవన్. అయితే విజయ్ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గనుక తాను అండగా నిలుస్తానంటూ చెబుతున్నాడు జయం రవి.

కోలీవుడ్ డైరక్టర్ విజయ్ వనమగన్ ఓ సినిమాను తీస్తున్నాడు. టార్జన్ సినిమాగా రాబోతున్న ఈ మూవీ లో రవి చివరిదాకా అడవి మనిషిగానే కనిపించబోతున్నాడంట. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. తన తండ్రి ఎడిటర్ మోహన్ తర్వాత తనపై అంత పెట్టుబడి పెట్టిన వ్యక్తి విజయ్ అని తెలిపాడు. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు.

ఒకవేళ దురదృష్టవశాత్తు సినిమా ఫ్లాప్‌ అయితే విజయ్‌ తో మరో సినిమా ఫ్రీ గా చేస్తానని అనౌన్స్ చేశాడు. షూటింగ్ మొత్తం అడవుల్లో జరిగిందని, ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకడం, సినిమా కోసం చర్మం రంగు మార్చుకోవడం చాలా కష్టంగా అనిపించిందని, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ శుక్రవారమే జంగిల్ రొమాంటిక్ మూవీ వనమగన్ రిలీజ్ అవుతుండగా, రవి సరసన అఖిల్ ఫేమ్ సయేషా హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayam Ravi  Director AL Vijay  Vanamagan Movie  

Other Articles