Anchor Dragged Director Puri in his Controversies

Anchor ravi on controversies on him

Anchor Ravi, Ravi Puri Jagannadh, Puri Movies Anchor Ravi, Anchor Ravi Controversies, Puri Heroines ANchor Ravi, Anchor Ravi Interview, Anchor Ravi Insult, Anchor Ravi Responded, Anchor Ravi Rumours

Tollywood Director Puri Jagannadh Movies inspired me Anchor Ravi on his Controversies. Never misbehave or insult with any female anchors he Added.

ఫిమేల్ యాంకర్లతో వివాదం.. పూరీని లాగాడు

Posted: 06/19/2017 02:10 PM IST
Anchor ravi on controversies on him

టాలీవుడ్ యాంకర్ రవి ఫిమేల్ యాంకర్లతో వ్యవహరించే తీరుపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. వారితో తెరపై క్లోజ్ గా మూవ్ అయినట్లే వెనకాల కూడా కెలికినట్లు వార్తలు వస్తుండటం చూస్తున్నాం. ఇదేకాదు యాంకరింగ్ చేసే సమయంలో నోరు అదుపు తప్పటంతో తిట్లు కూడా తింటున్న దాఖలాలు ఉంటున్నాయి. అయితే తనపై వచ్చే విమర్శలకు ఓ అర్థం పర్థం ఉండదని అంటున్నాడీ ఫేమస్ బుల్లితెర సెలబ్రిటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవి వీటిపై స్పందించాడు. యాంకర్లతో లింకులు అంటగట్టడం, వారు తనపై విమర్శలు చేయటంపై అడిగిన యాంకర్ తో కాస్త అసహనంగానే బదులిచ్చాడు. తన తోటి ఫిమేల్ యాంకర్ల సైజులపై గానీ, రంగుల గురించి గానీ అసభ్యరీతిలో తానెప్పుడూ కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చుట్టూ జనాలు ఉన్న టైంలో ఎలా ఉండాలోనన్న స్పృహ తనకు ఉందంటూ బదులిచ్చాడు.

దర్శకుడు పూరీ సినిమాలే తీసుకోండి. అందులో హీరోయిన్లను ఓసేయ్, ఏమే అంటూ హీరోలు సంభోదించటం చూస్తున్నాం కదా. అలాంటిది ఓ షో రన్ చేసే క్రమంలో తాను అలాంటి పదజాలం వాడితే తప్పేముంది. ఇప్పడున్న జనరేషన్ లో టీవీల్లో చూసే నేర్చుకుంటున్నారని, చెడిపోతున్నారని కొందరు చెబుతున్నారు. అదసలు నిజమేనంటారా? కేవలం కాంట్రవర్సీ హెడ్డింగ్ లతో, కథనాలతో పేరు సంపాదించుకునేందుకే కొన్ని వెబ్ సైట్లు కథనాలు, యూట్యూబ్ లలో స్టోరీలు పెడుతున్నాయంటూ మండిపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Anchor Ravi  Puri Jagannadh  

Other Articles