రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్న హిట్ దాహాన్ని కూడా తీర్చేశాడు. ఇక మూడో సినిమా ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా! డిజాస్టర్ గా మిగిలినప్పటికీ, తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ ఎంటర్ టైనింగ్ డ్రామానే అందించాడు.
ఇక ఇప్పుడు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేగా రాబోతున్నాడు. యాక్షన్ కమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో డీజే రూపొందినట్లు ట్రైలర్ లు చూస్తేనే అర్థమైపోతుంది. బన్నీలోని ఎనర్జీ లెవల్స్ ను వాడేసుకుని అద్భుతంగా తెరకెక్కించినట్లు చెబుతున్నాడు హరీష్. ఇప్పటికే మ్యూజికల్ హిట్ గా కన్ఫర్మ్ చేసుకోగా, తెరపై బన్నీ ఎనర్జీ లెవల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందంటున్నాడు.
అంతేకాదు బన్నీ కెరీర్ లో ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందని కామెంట్ చేశాడు. ముఖ్యంగా బ్రహ్మిణి రోల్ లో స్టైలిష్ స్టార్ ఆకట్టుకుంటాడని చెబుతున్నాడు. మరి హరీశ్ అంతగా ఎగ్జయిట్ అవుతున్న డీజే అంతటి విజయాన్ని అందిస్తుందా? లేదా? చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more