Tubelight Troubles to Duvvada Jagannadham

Dj opening day collections effect on eid

Tubelight DJ Movie, Duvvada Jagannadham Tubelight, DJ Tubelight, Allu Arjun Salman Khan, Allu Arjun DJ Movie, South Releases on Eid Season

Allu Arjun Duvvada Jagannadham collections may effect with Eid Releases. Salman Tubelight and Simbu Movie released on same date i.e. June 23rd.

బిగ్ కలెక్షన్లు.. డీజేకు అంత ఛాన్స్ లేదా?

Posted: 06/17/2017 02:08 PM IST
Dj opening day collections effect on eid

అల్లు అర్జున్ హీరోగా హిట్ డైరెక్టర్ హరీష్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజున సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’ భారీ అంచనాల మధ్య అదే తేదీన విడుదల కాబోతోంది. బాహుబలి 2 తర్వాత వసూళ్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి భారీ ఎత్తునే ట్యూబ్ లైట్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ తోపాటు బెంగళూరు.. చెన్నై లాంటి నగరాల్లోనూ ‘ట్యూబ్ లైట్’ భారీగానే విడుదలవుతోంది. ఇక కోలీవుడ్ బాక్సాఫీస్ లోనూ రెండు చిత్రాలు రిలీజ్ ఉండటంతో అక్కడ ఎఫెక్ట్ పడటం ఖాయం. ఈ లెక్కన డీజే వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయన్న ఆశలకు గట్టి పడినట్లేననుకోవచ్చు. ఈ సినిమా 80 కోట్ల బిజినెస్ చేసింది. ఆ నేఫథ్యంలో వసూళ్లు రాబట్టడం చాలా కీలకం.

ఇక ఈ మధ్యే ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ వర్గం వాళ్లు పాటపై అభ్యంతరం చెప్పటం, అది కాస్త సెన్సార్ బోర్డు దాకా వెళ్లటంతో సినిమా రిలీజ్ పై కాస్త డౌట్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ‘డీజే’ను జూన్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

ఇంకోవైపు యూఎస్‌లోనూ 300 లొకేషన్స్‌లో విడుదల చేయనుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన డీజే టీజర్, ట్రైలర్‌లలో బన్నీ నటన, స్టైలీష్ స్టార్ సరసన పూజా వాగ్దే చేసిన రొమాంటిక్ సీన్స్‌… యూట్యూబ్‌లో క్రియేట్ చేసిన సంచలనాల గురించి మరో మాట చెప్పనక్కర్లేదు. గంటల్లోనే లక్షల వ్యూస్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్, టీజర్ తోపాటు సెన్సార్ ఇన్నర్ వ్యూవ్ ప్రకారం బన్నీ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నట్లే అనే చర్చ జరుగుతోంది.

జూన్ 23న అభిమానుల ముందుకు రానుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వాయించే డీజే’ఏ రేంజ్ లో కలెక్షన్లు కుమ్ముతాడు అన్నదానిపైనే ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  DJ Movie  Salman Khan  Tubelight  

Other Articles

  • Aa 20 sukumar allu arjun movie title makers open up on reports

    బన్ని-సుకుమార్ సినిమా టైటిల్ శేషాచలంపై క్లారిటీ..

    Jan 20 | ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు... Read more

  • Tarak s funny banter with a photographer at the airport

    ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచి.. ఎన్టీఆర్ పంచులు..

    Jan 20 | ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షూటింగ్లో బిజీగా మారాడు. ఈ తరుణంలో తన మోగా పవర్ స్టార్ రాంచరణ్ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ ఫైర్... Read more

  • Pranab mukherjee confers champions of change 2019 award to allu aravind

    ప్రణబ్ చేతుల మీదుగా అల్లు అరవింద్ కు అవార్డు..

    Jan 20 | టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందని అగ్రనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పలు భారతీయ బాషల్లోనూ నాలుగు దశాబ్దాలుగా చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ సేవను... Read more

  • Happy birthday krishnam raju prabhas family celebrate his uncle s birthday

    రెబల్ స్టార్ కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

    Jan 20 | రెబల్ స్టార్‌ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. రెబల్ స్టార్ గా వెండితెరపై వెలిగి తనదైన ప్రత్యేకతతో అప్పట్లోనే... Read more

  • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

    దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

    Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

Today on Telugu Wishesh