Vishwaroopam 2 Teaser Release Date Fix

Kamal vishwaroopam 2 teaser ready for release

Kamal Haasan, Kamal Haasan Teaser, Vishwaroopam-2 Official Teaser, Vishwaroopam 2 Teaser, Vishwaroopam 2 Teaser, Vishwaroopam 2 Teaser Date, Kamal Haasan Thrill Vishwaroopam 2 Teaser

Kamal Haasan's Vishwaroopam 2 Teaser Release Date Fix. Kamal Announces the action sequel teaser on Ramadan and Movie on October 16.

విశ్వరూపం టీజర్ వస్తోంది.. మరి సినిమా?

Posted: 06/13/2017 10:32 AM IST
Kamal vishwaroopam 2 teaser ready for release

పద్మశ్రీ కమల్ హాసన్ సినిమాలకు కష్టాలు కొత్తేం కాదు. మర్మయోగి దగ్గరి నుంచి విశ్వరూపం 2 దాకా అన్నింటి వెనక ఆర్థికపరమైన కారణాలే ఉన్నాయన్నది స్వయంగా లోక నాయకుడే చెబుతుంటాడు. అయితే విశ్వరూపం విషయంలో మాత్రం ఆ కష్టాలు మరీ విపరీతంగా ఉన్నాయి. ఒకానోక సమయంలో సినిమాను ఆపేద్దామని కూడా నిర్మాతలు ఫిక్సయ్యారు. కానీ, తన సొంత పెట్టుబడులతో మొత్తానికి సినిమాను ఎలాగోలా పూర్తి చేసేశాడు ఈ సీనియర్ హీరో.

మరో నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక స్థితి మళ్లీ మెరుగు కావటంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసేశారు. ఇక ఇప్పుడు టీజర్ డేట్ ను కూడా చెప్పేశాడు. రంజాన్ సందర్భంగా విశ్వరూపం-2 టీజర్ వచ్చేస్తోందని చెప్పేశాడు కమల్. అంతేకాదు అక్టోబర్ 18న సినిమా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కూడా. టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో కమల్ థ్రిల్ చేయబోతున్నాడంట.

రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ ప్రధాన పాత్రలుగా రాబోతున్న ఈ మూవీలో కమల్ రా ఏజెంట్ గా నటించబోతున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ అండ్ మళయాళంలో సినిమా రిలీజ్ కాబోతుంది. మరో పక్క కమల్ బైలింగువల్ (తెలుగు, తమిళ్) శభాష్ నాయుడు షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishwaroopam 2 Teaser  Kamal Haasan  

Other Articles