Allu Aravind Proceed with Sampoorna Ramayanam Title

Another step in allu aravind ramayanam

Allu Aravaind, Allu Aravind ramayanam, Ramayana, Telugu Movie, Sampoorna Ramayanam Title, Sampoorna Ramayanam Movie, Sampoorna Ramayanam Telugu Movie, Sampoorna Ramayanam Title, Geetha Art's Ramayanam, Sampoorna Ramayanam Three Parts

Allu Aravind's Geetha Arts Registered Sampoorna Ramayanam Title. The Epic Movie in Three Parts.

రామాయణంలో మరో స్టెప్.. చెర్రీ కోసమేనా?

Posted: 06/08/2017 11:00 AM IST
Another step in allu aravind ramayanam

బాహుబలి అన్న ఒక్క ప్రాజెక్టుతో టోటల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ముఖ చిత్రం మారిపోయింది. ఓపక్క వెయ్యి కోట్లతో మళయాళంలో మోహన్ లాల్ తో భీముడిగా మహా భారత్ పనులు ప్రారంభం కాగా, కోలీవుడ్ లో సంఘమిత్ర కూడా అదే స్థాయి టాలీవుడ్ లో డిస్కషన్ కే దారితీసింది. ఇంతలో రామాయణం మీదే చిత్రం అనౌన్స్ చేసి పెద్ద షాకే ఇచ్చాడు టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

కానీ, అదంతా హడావుడే అని కొందరు ఇండస్ట్రీలో గుసగుసలాడుకున్నారు. అసలు ఈ స్టోరీని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు? రాముడుగా ఎవరు నటిస్తారు? తదితర విషయాలపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. దీంతో 500 కోట్ల అనౌన్స్ మెంట్ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ.. వాటన్నింటిని పటాపంచల్ చేస్తూ మరో అడుగు ముందుకు పడింది.

'సంపూర్ణ రామాయణం' అనే పేరిట టైటిల్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్ట్ చేయించేశారు. అంటే జననం దగ్గరి నుంచి పూర్తి స్థాయి కథతో ముందుగా చెప్పినట్లు మూడు భాగాలుగా ఇది తెరకెక్కే అవకాశం ఉంది. ఆ లెక్కన ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేసేశాడన్న మాట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoorna Ramayanam  Geetha Arts  Allu Aravind  

Other Articles