NTR to Host Telugu Version of Bigg Boss

Ntr ready to television debut

Junior NTR Television, NTR MAA Big Boss, Big Boss Telugu Show, NTR Television Debut, Star Maa TV Big Boss Show, NTR Chiranjeevi Star MAA Tv, NTR Remuneration Big Boss Show, Big Boss Telugu Host

Jr NTR to host Telugu Bigg Boss. Star MAA officially announced that news.

బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్

Posted: 05/29/2017 05:14 PM IST
Ntr ready to television debut

వ‌రుస‌గా హిట్లతో జోరు మీద ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఫ్యాన్స్ ను అలరించేందుకు బుల్లితెర‌ ఆరంగ్రేటానికి రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్ తెలుగు వర్షన్ కు జూనియర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. హిందీ ఛానెల్ లో పాపులర్ అయిన దీని తెలుగు వెర్షన్ కోసం అంతా సిద్ధం అవుతోంది. స్టార్ మా టీవీ ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతుంది.

ఈ విష‌యాన్ని ఆ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా క‌నిపించ‌నున్నాడ‌న్న వార్త తారక్ అభిమానుల్లో హుషారు నింపుతోంది. కాగా, బాలీవుడ్ లో బిగ్‌ బాస్ కు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మ‌రోవైపు తమిళంలో ప్రారంభం కాబోతున్న ‘బిగ్‌ బాస్‌’ షోకు క‌మ‌ల హాస‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఇప్పటికే స్టార్ మాలో నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోలు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అలరించారు. ఎన్టీఆర్ వంటి యంగ్ హీరో ఓ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడన్న వార్త బుల్లితెర ప్రేక్షకులకు ఓ శుభవార్తే. అయితే ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే.. చిరు కంటే ఎన్టీఆర్ కు రెమ్యునరేషన్ విషయంలో చాలా ఎక్కువే చెల్లించబోతున్నారంట సదరు ఛానెల్ యాజమాన్యం. ప్ర‌స్తుతం 'జై ల‌వ‌కుశ' సినిమాలో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Big Boss Show  Star Maa TV  

Other Articles