Sarath Kumar Again talks about Rajinikanth Political Entry

Sharat kumar fire on rajinikanth political entry

Sarath Kumar, Sarath Kumar Rajinikanth Politics, Rajini Locality, Rajinikanth Outsider, Sarath Kumar Rajinikanth, Sarath Kumar, Rajinikanth Kannadiga or Tamilian, Rajinikanth Sharath Kumar, Sharath Kumar 2.0 Movie

Sarath Kumar responded on Rajinikanth True Tamilian Comments. If rajini enter politics he will the first person to stop the release of 2.0.

రజనీ రాజకీయాలపై శరత్ కుమార్ ఫైర్

Posted: 05/23/2017 11:19 AM IST
Sharat kumar fire on rajinikanth political entry

అభిమానులతో ముఖాముఖి అంటూ మొదలుపెట్టి రాజకీయ కోణాలను స్పృశిస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఆరంగ్రేటం కోసం అంతా సిద్ధమంటూ అభిమానులు
హ్యాపీగా ఫీలవుతున్న తనంతట తానే స్థానికత అంశం లేవనెత్తటంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఇదే అదనుగా భావించిన సూపర్ స్టార్ యాంటీ గ్రూపు ఇంటి ముందు ధర్నా చేస్తుండటంతో తారాస్థాయికి చేరింది.

కన్నడిగుడైన రజనీకాంత్ ఎన్నటికీ తమిళుడు కాదంటూ పలువురు నినాదాలు చేశారు. తమిళనాడుకు తలైవా అక్కర్లేదని, కర్ణాటకకు వెళ్లిపోవచ్చంటూ వారు సూచించారు. ఇక ఈ ఆందోళనలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. ఏదైనా హాని తలపెట్టాలని చూస్తూ ఊరుకోమని ఆందోళనకారులను హెచ్చరించారు. ప్రస్తుతం రజనీ అభిమానులు ఓవైపు, కొన్ని తమిళ రాజకీయ వర్గాలు ఓవైపు ఉండి సీన్ ను నడిపిస్తున్నాయి.

గతంలో రజనీకి ఎదురు వెళ్తానంటూ వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కున్న నటుడు, నేత శరత్ కుమార్ మళ్లీ కామెంట్లు చేశాడు. ప్రజావేదికలపై ప్రసంగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఇండైరక్ట్ గా సెటైర్ వేశాడు.  అది రజనీ వ్యక్తిగత విషయం అంటూనే రాజకీయాల్లోకి రావటానికి ట్రై చేస్తే మాత్రం రాబోయే కొత్త సినిమా ‘2.ఓ’ను అడ్డుకోవటానికి కూడా తాను రెడీ అంటూ వివాదాన్ని మరింత రాజేసే యత్నం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Sarath Kumar  2.0 Movie  

Other Articles