'బాహుబలి-2: ద కన్ క్లూజన్' రికార్డుల పంట పండించింది. అనితర సాధ్యమైన రీతిలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఓవరాల్ గా 30 రికార్డులు సాధించి సత్తాచాటింది. హిందీలో 400 కోట్లు, తెలుగులో 200 కోట్లు, తమిళ్ లో 100, మళయాళంలో 50 కోట్లు... ఇలా కొల్లగొడుతోంది. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.1238 కోట్ల దాకా ఉండగా, అన్నిపోనూ డిస్ట్రిబ్యూటర్ కు వచ్చిన షేర్ రూ.613 కోట్లు.
టీజర్, ట్రైలర్, పోస్టర్ లన్నీ సోషల్ మీడియాలో రికార్డుల దుమ్ముదులపగా, ఏప్రిల్ 28న విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే వసూళ్ల పర్వం కొనసాగించింది. ఆడియో, శాటిలైట్ హక్కులు ఇలా వివిధ రూపాల్లో రికార్డు స్ధాయి వసూళ్లు సాధించింది. అనంతరం ఆన్ లైన్ ప్రీ బుకింగ్, కరెంట్ బుకింగ్ లలో రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ షోకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా, అత్యధిక ఆక్యుపెన్సీ సాధించిన సినిమా, తొలి రోజు వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా, మూడురోజుల్లో 300 కోట్లు, తొలి వారంలో 500 కోట్లు, రెండు వారాలు ముగిసే సరికి 1000 కోట్లు.
రెండో వారాంతానికి భారత్ లో అత్యదిక కలెక్షన్లు సాధించిన సినిమా, అమెరికాలో వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా, 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమా... ఇలా అనితరసాధ్యమైన చలనచిత్ర రికార్డులన్నీ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సొంతం చేసుకుంది. ఇలా జస్ట్ ఫర్ రికార్డ్స్ అన్నట్లు తయారయ్యింది బాహుబలి 2 కలెక్షన్ల పరిస్థితి. ఫుల్ రన్ లో 1500 కోట్లు.. హిందీలో 500 కోట్లు.. ఇలా ఇంకా చాలా చాలా రికార్డులే బద్ధలు కాబోతున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more