Non-Bailable warrant against Rakhi Sawant

Court issues non bailable warrant against rakhi sawant

Ludhiana Court, Rakhi Sawant, Rakhi Sawant Arrest, Rakhi Sawant Abscond, Rakhi Sawant Derogatory Remarks, Rakhi Sawant Valmiki, Rakhi Sawant Valmiki Mika Singh, Rakhi Sawant Court, Court Summons Rakhi Sawant, Bollywood Actress Court Warrant, Rakhi Sawant Valmiki Comments, Mika Sigh Valmiki

Ludhiana Court issues Non-Bailable warrant against Rakhi Sawant. In a TV Show she made a derogatory remark against Ramayana Writer Valmiki.

రాఖీ సావంత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్

Posted: 05/13/2017 08:21 AM IST
Court issues non bailable warrant against rakhi sawant

తన నోటిదూలతో పెద్ద వివాదంలో చిక్కుకున్న సెక్సీ నటి రాఖీ సావంత్ కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించటం లేదు. లుధియానా న్యాయస్థానం రాఖీకి మళ్లీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఓసారి ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, ఆమె జాడ పోలీసులు కనుక్కోలేకపోయారు. క్షమాపణ చెప్పినప్పటికీ ఆమెను వదిలే ప్రసక్తే లేదని నరిందర్ అదియా అనే న్యాయవాది ఆమెపై కేసు విషయంలో బలంగా ఉంటున్నాడు.

రామాయణాన్ని రాసిన వాల్మీకిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ...వాల్మీకి కులస్తులను కించపరిచారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అతగాడు స్థానిక కోర్టులో ఫిర్యాదుచేయటం తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశం మేరకు ఇద్దరు పోలీసు అధికారులు రాఖీ సావంత్ ను అరెస్టు చేసేందుకు ముంబై వెళ్లగా, కోర్టు పేర్కొన్న చిరునామాలో ఆమె దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం, ఈ కేసు విచారణను జూన్ 2 వతేదీకి వాయిదా వేసింది. కాగా, ఓ టెలివిజన్ షోలో గతంలో ఓ పార్టీలో ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టిన మికా సింగ్ ను క్షమిస్తున్నానని అతన్ని వాల్మీకితో పోలుస్తూ పైగా ఓ హంతకుడు రాసిన పుస్తకాన్ని ఆదికావ్యంగా చదువుతున్నామంటూ వివాదాస్పదంగా మాట్లాడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakhi Sawant  Non-Bailable Warrant  Valmiki Comments  

Other Articles