Rana Denies Rumour on Uyyalawada Role

Rana not in uyyalawada

Rana Chiranjeevi, Rana Uyyalawada Narasimha Reddy, Uyyalawada Movie, Chiru Uyyalawada Rumour, Uyyalawada Gossip, Rana CHiru Villain, Rana Negative Role Uyyalawada, CHiru 151 Movie

Media Reports that Rana is doing a key role in Chiranjeevi's Uyyalawada. But Rana has denied the news saying he was not approached for any role in Chiru's 151 Movie.

ఉయ్యలవాడలో రానా.. ఓ క్లారిటీ

Posted: 05/11/2017 02:55 PM IST
Rana not in uyyalawada

కథపరంగా సిద్ధమైనప్పటికీ డైలాగులు, ఇంకా కొన్ని స్క్రిప్ట్ లలో మార్పుల మూలంగా మెగాస్టార్ 151వ చిత్రం కాస్త డిలే అయిపోతుంది. ఉయ్యలవాడ గొప్పతనం ఏ మాత్రం డ్యామేజ్ కలగకుండా పక్కాగా తెరకెక్కించేందుకు యూత్ ఫుల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రెస్టెజీయస్ ప్రాజెక్టుకు మాటలు అందించిన సాయి మాధవ్ బుర్రా, వేమా రెడ్డి, మధు త్రయం ఈ పవర్ ఫుల్ హిస్టారికల్ హీరో మూవీకి మాటలు అందించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రానా నెగటివ్ రోల్ పోషించబోతున్నాడని కొంత కాలంగా టాక్ నడుస్తోంది. బాహుబలి-2 సక్సెస్ లో బిజీగా ఉన్న రానా తరపు నుంచి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

దర్శకుడు సురేందర్ నుంచి గానీ, నిర్మాత రాంచరణ్ నుంచి గానీ ఎటువంటి సంప్రదింపులు జరపలేదని రానా స్టాఫ్ తేల్చేశారు. అయితే ఒకవేళ అలాంటి ప్రపోజలే గనుక ఫ్రెండ్ చెర్రీ నుంచి వస్తే మాత్రం చిరు లాంటి లెజెండ్ తో నటించేందుకు అస్సలు వెనకడుగు వేయబోనని రానా తేల్చినట్లు తెలుస్తోంది. భల్లాలుడు గనుక చిరు తో ఢీ కొంటే మాత్రం అది ఖచ్ఛితంగా అదనపు ఆకర్షణ అయి తీరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raan  Uyyalawada Movie  Chiranjeevi  Negative Role  

Other Articles