Multiplexes ready to cash Baahubali 2 craze | బాహుబలి-2 మేనియా.. అంత పెద్ద మోసం.

Baahubali turned boon for multiplex stocks

Baahubali 2 Craze, Baahubali-2 Lobbying, Baahubali-2 Multiplexes, Baahubali 2 Multiplexes Cash, Multiplexes Baahubali 2 Cheat, Multiplex Stocks, Baahubali 2 Multiplexes Offer

Baahubali-2 Lobbying Started At Multiplexes. Multiplexes ready to cash Baahubali 2 craze. Already hiked tickets and combo packages. Atlast Baahubali Turned Boon for Multiplex Stocks.

బాహుబలి-2 క్రేజ్.. మల్టీప్లెక్స్‌ల మోసం

Posted: 04/24/2017 08:49 AM IST
Baahubali turned boon for multiplex stocks

దేశం మొత్తం బాహుబలి మేనియాతో ఊగిపోతుంది. మరో నాలుగు రోజుల్లో అన్ని ప్రశ్నలకు థియేటర్లో సమాధానాలిచ్చేందుకు రాజమౌళి టీం సిద్ధమైపోయింది. అందులో ఏ ఒక్కటి మిస్సయినా బాహుబలి-3 ఉంటుందనే లెక్క. ఇక రికార్డుల బలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు థియేటర్లు సిద్ధమైపోతున్నాయి.

ఆన్ లైన్ బుకింగ్ సంగతి ఏమోగానీ, టికెట్లు బ్లాక్ చేస్తున్నారననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పలు మల్టీప్లెక్స్‌లు అయితే ప్రేక్షకుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట నయా దందాకు రంగం సిద్ధం చేశాయి. ఇష్టం ఉన్నా లేకున్నా కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను అమ్ముకుని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. దీనికి ప్రత్యేకంగా ‘కాంబో ఆఫర్’ అని పేర్లు తగిలించాయి. ఇప్పటికే ఆఫర్ల పేరుతో టికెట్ ధరను ఏకంగా 75 శాతం పెంచే స్కెచ్ వేశాయి. దళారులు, మల్టీప్లెక్స్ నిర్వాహకులు కలిసి ఈ దందాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాకు మొదటి మూడు రోజులపాటు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌లలో టికెట్లన్నీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు.

ఇందుకోసం మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధర రూ.150 అయితే కాంబో ఆఫర్ పేరుతో దానిని రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. తద్వారా ఒక్క షో ద్వారానే లక్షలాది రూపాయలు పిండుకుంటున్నారు. ఇక ఒక్కో టికెట్‌ను రూ.450 పెట్టి కొంటున్న దళారులు వాటిని ఎంట్రీ పాస్‌ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. వాటిపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ విషయంలో చెక్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి విజ్నప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Multiplexes  Ticket Rate Increase  

Other Articles