స్పైడర్ ను చూసి ఫ్యాన్సే భయపడిపోతున్నారా? | Mahesh fans fear with spyder title.

Mahesh s spyder fear with title sentiment

Spyder Sentiment, Tollywood er Title Semtiment, SPYder title, Spyder Movie, Mahesh Babu Title Sentiment, Mahesh Babu Murugadoss Movie, Mahesh Title Sentiment, Tollywood Title Sentiment

Negative Sentiment for ER title in Tollywood. Mahesh fans are fearing about Spyder which also got the 'er' at the end.

మహేష్ స్పైడర్ టైటిల్ కి బ్యాడ్ సెంటిమెంట్

Posted: 04/17/2017 10:40 AM IST
Mahesh s spyder fear with title sentiment

సెంటిమెంట్లు అన్నది వర్కవుట్ అవ్వటం, కాకపోవటం పక్కనుంచి అభిమానుల్లో మాత్రం దాని మీద నమ్మకాలు మాత్రం పీక్స్ లో ఉంటాయి.  టైటిల్ దగ్గరి నుంచి రిలీజ్ డేట్ దాకా ఇలా ప్రతీ విషయంలోనూ సెంటిమెంట్ పేరుతో హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్క అభిమానులే కాదు, యాంటీ ఫ్యాన్స్ కూడా దానిని బేస్ చేసుకుని అవతలి చిత్ర ఫలితాలను నెగటివ్ గా ప్రచారం చేయటం చూస్తుంటాం. సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది.

మురగదాస్ డైరక్షన్ లో రాబోతున్న స్పైడర్ ఫస్ట్ లుక్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి లైట్ తీస్కుంటే టైటిల్ విషయంలోనే ఇప్పుడు ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. ఈ మద్య టాలీవుడ్ లో ఈఆర్ అక్షరాలతో ముగిసిన చిత్రాలేవీ ఆడిన దాఖలాలు లేవు. లోఫర్, విన్నర్, చివరగా రీసెంట్ రిలీజ్ మిస్టర్ లు డిజాస్టర్లుగా మారాయి. దీంతో యాంటీ ఫ్యాన్స్ స్పైడర్ పని అంతేనంటూ ట్రోల్స్ వేస్తున్నారు.

అయితే ఇలా టైటిల్ సెంటిమెంట్ ను సీరియస్ గా తీసుకోల్సిన అవసరంలేదని మరికొందరు అంటున్నారు. డు.. సెంటిమెంట్ ను ప్రస్తావిస్తూ ఒక్కడు, దూకుడు భారీ హిట్లుగా నిలిస్తే, అతడు, సైనికుడు, ఆగడు ఫ్లాప్ లు అయ్యాయన్న విషయం గుర్తు చేస్తూ అంతంగా పట్టించుకోవాల్సిన పనేం లేదని చెబుతున్నారు. డైరక్టర్ టేకింగ్, సినిమాలో కంటెంట్ ఈ రెండూ ఉంటేనే ఆడుతుంది తప్ప, సెంటిమెంట్లు సిల్వర్ స్క్రీన్ పై వర్కువుట్ అయిన దాఖలాలు లేవన్నది వారి వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Title Sentiment  

Other Articles