మిస్టర్ డిజాస్టర్... బన్నీ ముందే గెస్ చేశాడా? | Here is Why Allu Arjun Miss Mister.

Bunny right decision on mister missing

Mister Verdict, Mister Allu Arjun, Allu Arjun Great Escape Mister, Mister Movie, Allu Arjun Disaster Mister, Mister Movie Verdict, Varun Tej Allu Arjun Mister, Srinu Vaitla Bunny Mister

Mister was first offered to Allu Arjun. But after result showed Bunny cleverly escaped from this big disaster.

బన్నీ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడుగా...

Posted: 04/15/2017 09:56 AM IST
Bunny right decision on mister missing

ఒకరు చేయాల్సిన సినిమా మరోకరి చేతిలోకి వెళ్లిపోవటం. అది హిట్టయ్యాక తాను చేయలేకపోయానే అని ముందు హీరో ఫీలయిపోవటం, రాసి ఉండాలంటూ సక్సెస్ అయిన హీరో డబ్బాలు కొట్టుకోవటం ఇలా ఈ మధ్య టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ గా మారిపోతుంది. అయితే సినిమా ఎందుకు చేజార్చుకుంటున్నారు అన్నదానికి కారణాలు తెలీకపోయినప్పటికీ వాళ్ల వర్షన్ మాత్రం ‘అనివార్య కారణాలు అని’...

ఒకవేళ సినిమా సక్సెస్ అయితే ఫర్వాలేదుగానీ అదే సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి? అలాంటి సిచ్యూయేషన్ ఇప్పుడు మిస్టర్ సినిమా విషయంలో ఎదురయ్యింది. ముందు ఈ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పని బన్నీ శీను కథకు సారీ చెప్పేసిన చల్లగా డీజే తో కమిట్ అయిపోయాడు. అయితే ఎలాగోలా అది మెగా కాంపౌండ్ లోని వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లి పట్టాలెక్కింది.

ఇక నిన్న రిలీజ్ అయిన మిస్టర్ ఎంత దారుణమైన రిజల్ట్ రాబట్టిందో తెలిసిందే. ఫస్ట్ షోకే ఈ ఫ్యామిలీ డ్రామాకు అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చేసింది. కొత్తగా ట్రై చేశానని శీనువైట్ల చెబుతూ వస్తున్నప్పటికీ(ఇప్పటికీ కూడా అదే చెబుతున్నాడు) పేలవమైన కథ అని ముందే గ్రహించిన అర్జున్ తెలివిగా ఎస్కేపయ్యాడన్న మాట. ఫలితంగా దారుణమైన డిజాస్టర్ వరుణ్ ఖాతాలోకి చేరిపోయింది. వాట్ ఏ గ్రేట్ ఎస్కేప్ బన్నీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Mister Movie  Disaster  

Other Articles