సూపర్ స్టార్ కి పోటీగా సంపూ ట్రైలర్ ఇదిగో... | Sampoornesh Kobbari Matta Song Trailer Out.

Kobbari matta song trailer released

Puri Jagannadh Sampoornesh Babu, Sampoornesh Babu Sambho Sivasambho Song, Sambho Sivasambho Song Trailer, Sampoornesh Babu Puri Jagannadh, Puri Jagannadh Kobbari Matta, Kobbari Matta Song trailer, Sampoornesh Babu Kobbarimatta, Sampoo as Papa Rayudu, Sampoornesh Mahesh Babu

Sampoornesh Babu Staring Kobbari Matta movie Sambho Sivasambho Song Trailer launched by Puri Jagannadh.

కొబ్బరి మట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్

Posted: 04/13/2017 10:58 AM IST
Kobbari matta song trailer released

హృదయ కాలేయం అనే డార్క్ కామెడీ స్పూఫ్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన సంపూర్ణేష్ బాబు తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితమే కొబ్బరి మట్ట అనే సినిమా మొదలుపెట్టినప్పటికీ అది ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అయితే మధ్య మధ్యలో మాత్రం పోస్టర్లతో, వీడియోలతో సందడి చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఓ సాంగ్ ట్రైలర్ నే రిలీజ్ చేసి పడేశాడు.

ఓపెన్ చేస్తే రాయలసీమ కరువు గురించి ఫన్నీ మాడ్యులేషన్ లో చెబుతూ, అక్కడ కష్టాలను కడతేర్చటానికి ఓ దేవుడు వస్తున్నాడంటూ పిలక, పంచెకట్టులో ఉన్న సంపూని కారులోంచి దించేశారు. శంభో శివ శంభో అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆపై ఎమోషనల్ గా సాంగ్ సాగుతుంటే దానిని తనదైన విచిత్రమైన స్టెప్పులేస్తూ సంపూ తాండవం చేసేశాడు. అప్పట్లో పెద్దరాయుడిగా గుక్కతిప్పుకోకుండా ఓ బారీ డైలాగ్ చెప్పిన సంపూ ఇప్పుడు పాపారాయుడిగా ఇలా దర్శనమిచ్చాడు.

 

ఇక మరో యంగ్ పాత్ర ఆండ్రాయికి సంబంధించిన ఇంట్రోనే ఇక మిగిలి ఉంది. హృదయ కాలేయం దర్శకుడు స్టీవెన్ శంకర్(రాజేశ్ నీలం) దర్శకత్వం వహించిన కొబ్బరి మట్ట ఈ సమ్మర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వైరస్-నోవాక్సిక్ ఓన్లీ టాక్సిన్ అనే మరో చిత్రంలో కూడా సంపూ నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta  Sambo Sivasambo Song Trailer  Puri Jagannadh  

Other Articles