బూతు డైలాగులు, సెక్స్ సీన్లు మొత్తం లేపేస్తారా? | Love Making and abuse scenes cut from Begum Jaan.

Begum jaan censor troubles began

Begum Jaan, Vidya Balan Begum Jaan, Begum Jaan Censor, Begum Jaan CBFC, Begum Jaan Certificate, Begum Jaan Controversy

No Abuses, Love Making & Other Scenes Cut to Half from Vidya Balan's Begum Jaan.

బేగం జాన్ సెన్సార్ పై వివాదం

Posted: 04/01/2017 04:38 PM IST
Begum jaan censor troubles began

సెన్సార్ బోర్డులు వేస్తున్న కత్తెరలకు బలైపోతున్న సినిమాల లిస్ట్ చాంతాడంత తయారవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ తాకిడి మరీ ఎక్కువైపోయింది. అంతకు ముందు ఇంటిమేట్ సీన్లు, వల్గర్ డైలాగుల విషయంలో కనికరం చూపిన సెన్సార్ ఉడ్తా పంజాబ్ విషయంలో ఇగో హర్ట్ అవ్వటంతో అన్ని సినిమాలపై కాంసంట్రేషన్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ కు రెడీగా ఉన్న బేగం జాన్ విషయంలోనూ బోర్డు అదే రితీలో వ్యవహరించిదని తెలుస్తోంది.

విద్యాబాలన్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో సన్నివేశాలు మరీ టూమచ్ గా ఉన్నాయని సీబీఎఫ్ సీ 12 కట్ లకు ఓకే అయితేనే సర్టిఫికెట్ ఇస్తానని తేల్చి చెప్పేసిందంట. అంతేకాదు సినిమాలో 50 శాతం సీన్లలో డైలాగులకు మ్యూట్ కూడా చెప్పేందుకు అంగీకరిస్తేనే ముందుకు వెళ్తామని చిత్ర యూనిట్ కు నోటీసులు పంపించిందంట. సగానికి సగం కట్ చేస్తే ఇంక సినిమా ఏముంటందని ఇప్పుడు వివాదం మొదలైంది.

రొమాంటిక్ సన్నివేశాలతోపాటు జాతి పరమైన విద్వేషాల గురించి హింస ఎక్కువగా ఉండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు చెబుతోంది. అయితే సినిమా ఇండియా పాక్ విడిపోయే టైం, పైగా బ్రోతల్ హౌస్ అనే నేపథ్యంలో తెరకెక్కింది. అలాంటప్పుడు దానిని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీయాలా ఏంటని మేకర్లు ప్రశ్నిస్తున్నారు. సెన్సార్ మోరల్ పోలీసింగ్ పేరిట మరీ టూమచ్ చేస్తున్న బోర్డు వ్యవహారంపై కోర్టు బోనులోనే తేల్చుకుంటామని వారు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Begum Jaan  Vidya Balan  Censor Issues  

Other Articles