తొందరపాటే దెబ్బ తీసిందా? కలెక్షన్లు ఎలా ముగుస్తాయో? | Katamarayudu biggest mistake.

Katamrayudu second half finished in 20 days

Katamarayudu Unique Record, Katamarayudu 50 Crores, Katamaraydu Collections, Katamarayudu Talk, Katamarayudu Second Half, Katamarayudu Main Reason

Pawan kalyan Katamrayudu Second Half Finished in 20 Days. That lead to weak story. Even though talk katamarayudu collects 50 crores. Unique record in Tollywood with four fifty crores movies.

కాటమరాయుడు తొందరే దెబ్బ తీసిందా?

Posted: 03/30/2017 04:56 PM IST
Katamrayudu second half finished in 20 days

సెకండాఫ్ వీక్ గా ఉండటంతోనే పవన్ కళ్యాణ్ కాటమరాయుడును దెబ్బతీసిందని యూనానిమస్ గా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్, ఎంగేజింగ్ గా తీసిన ఫస్టాఫ్ లు సినిమాకు ఎంత బలం అయ్యాయో, కాస్త కేర్ తీసుకుని సెకంఢాఫ్ పై శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని క్రిటిక్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు తప్పు ఎక్కడ దొర్లిందోనన్న విషయం పై ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు.

నిజానికి ఫిబ్రవరి దాకా నిదానంగా జరిగిన షూటింగ్, తర్వాత సూపర్ వేగం పుంజుకుంది. కేవలం మూడంటే మూడు వారాల్లోనే సెకంఢాఫ్ పోర్షన్ ను మొత్తం పూర్తి చేసేశారు. అందుకే అవుట్ పుట్ ఇలా క్వాలిటీ లేకుండా వచ్చిందని అంటున్నారు. ఇతర విషయాల్లో కూడా బిజీలో ఉంటున్న పవన్ ఇకనైనా సినిమాల విషయంలో కాస్త శ్రద్ధ కనబరచాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

మొత్తానికి ఉగాది రోజు కలెక్షన్లు కాస్త పెరగటంతో మొత్తం ఇప్పటిదాకా 52 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇప్పటిదాకా నాలుగు 50 కోట్ల సినిమాలను(గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ మరియు కాటమరాయుడు) అందించిన హీరోగా పవన్ టాలీవుడ్ లో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. మూడేసి సినిమాలతో మహేష్, బన్నీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఓవర్సీస్ లో కూడ సర్దార్ వేసిన దెబ్బ నుంచి కాటమరాయుడు సేఫ్ చేసినట్లేనని చెప్పుకుంటున్నారు. అక్కడ సోమవారం దాకా 6.84 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ లో డబ్బింగ్ చిత్రాలతో కలిపి మూడు చిత్రాలు రిలీజ్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా 60 నుంచి 65 కోట్ల షేర్ తో కాటమరాయుడు కలెక్షన్లు క్లోజ్ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Collections  

Other Articles