అడల్ట్ మూవీ కారణంగానే గోల్డెన్ ఛాన్స్ మిస్? | Babu Baga Busy not reason for Item Song miss.

Sreemukhi out from mister item song

Anchor Sreemukhi, Sreemukhi Babu Baga Busy, Babu Baga Busy Actress, Sreemukhi Item Song, Sreemukhi Varun Tej, Sreemukhi Golden Chance, Sreemukhi New Movie, Madhu Sneha Mister Item Song

Anchor Sreemukhi has missed on a big opportunity. She was the initial choice for a special dance number in his upcoming movie with Srinu Vaitla, ‘Mister’. Because of the height issues, Sree Mukhi was replaced with ‘Baahubali‘ special song girl Madhu Sneha who featured in ‘Manohari’ as one of the three dancers. Varun Tej is visibly very tall and Sree Mukhi couldn’t match his height.

మిస్టర్ ఐటెం నుంచి శ్రీముఖి అవుట్

Posted: 03/27/2017 12:36 PM IST
Sreemukhi out from mister item song

బుల్లితెరపై తమ అందాలతో కిక్కెస్తున్న యాంకర్ లు అల్టిమేట్ గా సిల్కర్ స్క్రీన్ ను చేరటమే లక్ష్యంగా చేసుకుని కెరీర్ ను చక్కదిద్దుకుంటున్నారు. జబర్దస్త్ అందాలు అనసూయ, రష్మీలు ఇలా సినిమాల్లోకి వెళ్లిన వారే. వీళ్ల బాటలో మరో యాంకర్ శ్రీముఖి కూడా జాయిన్ అయ్యింది.

మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ అనుకున్నంత స్థాయికైతే ఈ తెలుగు యాంకర్ చేరుకోలేకపోయింది. అందుకే ఐటెం నంబర్ తో తన రేంజ్ ను పెంచుకోవాలని ఎప్పటి నుంచో కాచుకుని కూర్చుంది. ఆ అవకాశం వరుణ్ తేజ్ మిస్టర్ రూపంలో తగిలింది. అయితే చివరి నిమిషంలో ఆ ఛాన్స్ చేజారినట్లు తెలుస్తోంది. బాబు చాలా బిజీ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించిందన్న కారణంగానే ఆ ఛాన్స్ పోయినట్లు చెప్పుకున్నారు. 

అయితే కారణం అది కాని ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్ పక్కన హైట్ సమస్య కారణంగా శ్రీముఖిని తప్పించి ఆ స్థానంలో బాహుబలి మనోహరి సాంగ్ ఫేమ్ మధు స్నేహ ను తీసుకున్నట్లు సమాచారం. అయితే అనసూయ విన్నర్ ఐటెం సాంగ్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపలేదన్నది తెలిసిందే కదా. అందుకే మిస్టర్ ఛాన్స్ మిస్ కావటం గోల్డెన్ ఛాన్స్ కోల్పోయినట్లేం కాదని అనుకోవాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Sreemukhi  Mister Item Song  Madhu Sneha  

Other Articles