జక్కన్న వాళ్లను అంతగా పొగిడాడు.. మరి మిగతా వాళ్లో? | Rajamouli and others speech at Baahubali 2 Pre release.

Bahubali 2 pre release event highlights

Baahubali The Conclusion, Baahubali 2 Pre Release Function, Baahubali 2 Karan Johar, Karan Johar Rajamouli, Prabhas Bahubali 2 Pre Release, Rana Bahubali 2 Pre Release, Rajamouli Bahubali 2 Pre Release, Nani Bahubali 2 Pre Release, Karan Johar Bahubali 2 Pre Release, Aushka Bahubali 2 Pre Release, Sathyaraj Bahubali 2 Pre Release, Ramya Krishna Bahubali 2 Pre Release, Rana Bahubali 2 Pre Release, Krishnamraju Bahubali 2 Pre Release

Baahubali The Conclusion Pre release event highlights.

బాహుబలి-2 .. ప్రీ రిలీజ్ హైలెట్స్

Posted: 03/27/2017 08:26 AM IST
Bahubali 2 pre release event highlights

ఈ రోజు బాహుబలి సినిమా కోసం ఇలా ఒక స్టేజ్ మీద నుంచున్నా అంటే.. ఇది స్టేజ్ కాదు.. ఇది కొందరి వర్కర్ల భుజాలు. వారి భుజాలపై మేం నుంచున్నాం.. అంటూ బాహుబలిః ది కంక్లూజన్ కోసం పనిచేసిన చిన్న చిన్న కార్మికులను కూడా పేరుపేరునా పొడిగేశాడు రాజమౌళి. తాను మాట్లాడ్డానికి సమయం తక్కువగా ఉన్నా కూడా.. సినిమాకు పనిచేసన ఎంతోమంది వర్కర్లను ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కొనియాడాడు జక్కన్న.

''వర్కర్స్ ఎంతోమంది ఉన్నారు. బ్యాక్ పెయిన్ తో పనిచేసిన మా జిమ్మీ ఆపరేటర్స్ నాగరాజు.. ఈ సినిమా ప్రీ లుక్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్.. టీలు అందించిన ప్రొడక్షన్ కుర్రాళ్ళు.. సెట్లకు రంగులు వేసిన వర్కర్స్.. సాంగ్స్ కంపోజింగ్ లో సాయం చేసిన ఫైట్ మాష్టర్లు.. ఫైట్లను తీయడంలో సాయం చేసిన కొరియోగ్రాఫర్లు.. అసలు డ్యాన్స్ మాష్టర్ అయ్యుండీ బాణాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన శంకర్ మాష్టర్.. ప్రతీ ప్రాప్ కోసం రిగ్గింగ్ అద్బుతంగా చేసిన సాల్మాన్.. కాస్ట్యూమ్స్ కృష్ణ..'' ఇలా చాలామంది పేరుపేరునా పొగిడేశాడు రాజమౌళి. రాత్రి 12కి వారి పని ముగిసేదని, మళ్లీ తెల్లవారుజామున 3 గంటలకు వారు సెట్ లో సిద్ధంగా ఉండేవారని చెప్పాడు. అలాగే తన ఎడిటర్.. డబ్బింగ్ ఇన్ చార్జ్.. సౌండ్ సూపర్ వైజ్ చేసిన కళ్యాణి మాలిక్ (మ్యూజిక్ డైరక్టర్).. ఇలా అందరినీ పొగిడేశాడు.

బాహుబలి సినిమా సెట్ కు, ఆడియో ఫంక్షన్ కు సాయం చేసిన రామోజీరావు గారికి, హయత్ నగర్ పోలీసులు, కమిషనర్ మహేష్ భగవత్ గారికి ధన్యవాదాలని రాజమౌళి తెలిపారు. తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా పని చేశారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి డిపార్ట్ మెంట్ ను అభినందించిన రాజమౌళి.. తన భార్యను ఇంకా ఎక్కువ పొగిడితే చెప్పిన మాట వినరని చమత్కరించాడు. ఇక యూనిట్ తన కుటుంబం లాంటిదని చెప్పాడు.

హీరోయిజం ఎలా ఉండాలని ఊహించేవాడినో, అలాగే చేసేవాడినని.... అయితే ప్రభాస్ కు నేను ఏం ఇచ్చాను? అని ఆలోచించే వాడినని.. కానీ, బాంబేలో ప్రభాస్ ఓ ఫంక్షన్ కు వెళ్తే... అక్కడి మీడియా బాహుబలి అంటూ ప్రభాస్ ఎంటర్ అవుతున్నప్పుడు అరిచారని, అది చాలనిపించిందని రాజమౌళి అన్నాడు. అలాగే ఈ సినిమా రెండవ భాగం కోసం తన కొడుకు కార్తికేయ సినిమా సెకండ్ యునిట్ ను బాగా డైరక్ట్ చేశాడని చెప్పాడు రాజమౌళి. ఫస్టు పార్టు ట్రైలర్ ను తాను ఒక స్టోరీ చెప్పి కట్ చేయించినా కూడా.. 2వ పార్టుకు మాత్రం కార్తికేయ తన టీమ్ తో కలసి సొంతంగా ట్రైలర్ కట్ చేశాడని.. 25 వర్షన్లు కట్ చేశాక ఒకటి పిక్ చేశానని ఆయన తెలిపాడు.

67 ఏళ్ల తర్వాత బాహుబలే...

ఇండియన్ సినిమాకు బాహుబలి చాలా విలువైన ప్లాట్ ఫాం ఇచ్చిందని బాలీవుడ్ మేకర్ కరణ్ జోహర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాంటి బాహుబలి వేదికపై మాట్లాడడం తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. మొఘల్- ఏ- ఆజమ్ సినిమా తరువాత మళ్లీ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలి అని కరణ్ జొహార్ తెలిపాడు. సరిగ్గా 67 ఏళ్ల తరువాత మొఘల్ ఏ ఆజమ్ లాంటి బాహుబలి రావడం గొప్పవిషయమని కరణ్ చెప్పాడు. నాలుగేళ్ల కాలాన్ని ఒక దర్శకుడికి నటులు ఇచ్చేశారంటే వారికి ఎంత నిబద్ధత ఉందో ఊహించవచ్చని కరణ్ అన్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా చూపిన నిబద్ధత గొప్పదని కరణ్ ప్రశంసించాడు. ఈ సినిమాను ధర్మాప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇక రాజమౌళిని ఓ రేంజ్ లో పొగిడిన కరణ్ హాలీవుడ్ కన్నా మన దగ్గర తోపు దర్శకులు ఉన్నారన్న దానికి జక్కన నిదర్శనమని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Bahubali 2  Pre Release Event  

Other Articles