కైకాలకు ఆ గౌరవం దక్కకుండా చేశారా? | Why Kaikala Satyanarayana did not get Padmashri.

Kaikala satyanarayana about padma shri

Kaikala Satyanarayana, Kaikala Padma Shri Award, Kaikala About Tollywood, Kaikala Chiru Mohan Babu Brahmi, Kaikala Satyanarayana Comments

Kaikala Satyanarayana About The Padma Shri Award.

పద్మశ్రీలకు రికమండేషన్లు కావాలి-కైకాల సత్యనారాయణ

Posted: 03/24/2017 04:32 PM IST
Kaikala satyanarayana about padma shri

టాలీవుడ్ లో దిగ్గజ నటుల్లో కైకలా సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్, ఎస్పీఆర్ ల తర్వాత డైలాగ్ డెలివరీలతోసహా పౌరాణిక పాత్రలకు సూట్ అయ్యే పర్సనాలిటీ ఆయనది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన ఆయన క్రమంగా స్క్రీన్ కు దూరం అయిపోయారు. నవరసనటనా సార్వభౌముడిగా కళామతల్లికి నాలుగు దశాబ్దాలుగా సేవ చేసిన ఆయనకు ఇన్నేళ్ల కెరీర్ లో ప్రభుత్వం తరపున ఆయనకు ఒక్క గౌరవం దక్కలేదు. మరి ఆయనకు ఆ అర్హత లేదా? దానిపై ఆయన స్పందన ఏంటో ఆయన మాటల్లోనే...

పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నా పేరును పద్మశ్రీకి రికమండ్ చేసింది. నా బయోడేటాతోపాటు అన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వం తెప్పించుకుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణచారి అప్పుడు ఎఫ్ డీసీ కమిషనర్ గా ఉండి ఈ వ్యవహారం దగ్గరుండి చూసుకున్నారు. హోం మినిస్టర్ ముందుకు ఫైల్ వెళ్లింది. అప్పుడు నా వివరాలను చూసిన ఆయన ఈయన ఒకప్పుడు టీడీపీ నుంచి ఎంపీగా చేశారు. కాబట్టి ఈ హోదాకు అనర్హుడు అంటూ పక్కకు పడేశారు.

ఆ తర్వాత సంజయ్ బారు అనే వ్యక్తి నాకు లెటర్ రాశారు. మీకు ఇలా అన్యాయం జరుగుతోంది అని. ఆయన అప్పడు ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ పీఏ కూడా. వచ్చే ఏడాది అయినా మీకు వచ్చేలా చూస్తానంటూ అందులో చెప్పాడు. కానీ, ఆయనకు కూడా అదే సమాధానం వచ్చిందంట. అయినా కళలకు, రాజకీయాలకు సంబంధం ఏంటి? అదో సాకు మాత్రమే.

మన చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందం వీళ్లందరికీ ఎలా వచ్చాయి. కేవలం బ్యాగ్రౌండ్. అది నాకు లేదు. రికమండ్ చేసిన తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నటనతో ప్రజల హృదయాలను గెలుచుకోవటం కంటే గొప్పది ఏం ఉంటుంది చెప్పండి అంటూ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kaikala Satyanarayana  Tollywood  Padmashri Puraskar  

Other Articles

Today on Telugu Wishesh