తెలుగు ఛాన్సులు ఎందుకు వదులుకుంటుంది? ఆ స్టార్ డైరక్టర్ తో ఏం చెప్పిందంటే... | Nithya Menon wants to fullfill her direction dreams.

Nithya menon to direct a bilingual movie

Nithya Menon, Nithya menon Dream, Nithya Menon New Avatar, Nithya Menon Bilingual Movie, Nithya Menon Direction, Nithya Menon Avoid Tollywood, Nithya Menon Upcming Movies, Nithya Menon 2017 Movies

Actress Nithya Menon avoid telugu movies. But, Here is the main reason that she is planning to direct a bilingual movie.

దర్శకురాలిగా హీరోయిన్ నిత్యా మీనన్

Posted: 03/22/2017 11:27 AM IST
Nithya menon to direct a bilingual movie

గతేడాది ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్ లలో నటించిన నిత్యామీనన్ మరో మూడు డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ యేడాదిలో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాకు సైన్ చేయకపోవటమే కాదు, అల్రెడీ ముందుగా కమిట్ అయిన రెండు తెలుగు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవటం, అందులో మహనటి లాంటి క్రేజీ ప్రాజెక్టు ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

రెమ్యునరేషన్ పెంచిదా? లేక కథలు నచ్చటం లేదా? ఏది ఏమైనా పక్కా స్క్రిప్ట్ లతో అప్రోచ్ అవుతున్న స్టార్ దర్శకులకు కూడా మొండి చేయి ఎందుకు చూపిస్తుంది అన్న దానిపై డౌట్లు మొదలయ్యాయి. అయితే రీసెంట్ గా వెళ్లిన ఓ దర్శకుడికి మాత్రం తాను ఎందుకు సినిమాలు కమిట్ కావటం లేదో చెప్పేసిందంట. దాని ప్రకారం దర్శకత్వం వహించాలన్న కల నెరవేర్చుకునేందుకు నిత్య కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదని సమాచారం. ఇప్పటికే మూడు స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ మళయాళం మరియు తెలుగు భాషల్లో ఆ సినిమాను తెరకెక్కించేందుకు యత్నాలు మొదలుపెట్టిందంట.

దర్శకత్వం వహించాలన్నదే తన డ్రీమ్ అని ఈ మల్లూ బ్యూటీ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆ కలను నెరవేర్చుకునే పనిలో పడిందని తెలుస్తోంది. ఇంతకు ముందు కొందరు హీరోయిన్లు డైరక్షన్ ప్రయత్నాలే చేసినప్పటికీ వారిలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. మరి వచ్చే ఆఫర్లను కూడా కాదనుకుని నిత్య చేస్తున్న ఈ అటెంప్ట్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తర్వాతి చిత్రంలో ఓ కీ రోల్ పోషించటం మినహా మరేయితర కొత్త ప్రాజెక్టులకు కమిట్ కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIthya Menon  Tollywood  Direction Department  

Other Articles