మహేష్ బాబు మురగదాస్ ప్రాజెక్టు కంటే తర్వాతి చిత్రం లోనే చాలా క్లారిటీతోనే పక్కాగా ఉంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా టైటిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా జూన్ 23న సినిమాను థియేటర్లకు వచ్చి తీరుతుందని మురగదాస్ స్పష్టం చేయటం తెలిసిందే. ఇక ఇప్పుడు వైశాఖం సినిమా ఆడియో వేడుకలో
పాల్గొన్న మహేష్ ఉగాదికి ఒకరోజు అటు ఇటుగా ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక మహేష్ #24 కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతుందనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయ్యింది కూడా. అల్రెడీ స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వరుసగా నాలుగోసారి కూడా కొరటాల సినిమాకు దేవీయే స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవీశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా టైటిల్ ను బయటపెట్టేశాడు.
Had an Awesome time composing 4 @sivakoratala sir & @urstrulyMahesh sir's #BHARATHaneNENU !! Thx 4 joinin us @dop007 sir wit my team pic.twitter.com/voleTG3Czp
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 15, 2017
మ్యూజిక్ సిట్టింగ్స్ లో కొరటాల శివ కూడా భాగస్వామి అయ్యాడని, సిట్టింగ్స్ అద్భుతంగా జరగుతున్నాయని పేర్కొంటూ...'భరత్ అను నేను' అంటూ టైటిల్ సినిమాకు సంగీతం అందించే బాధ్యత అప్పగించిన మహేష్ బాబు, కొరటాల శివకు ధన్యవాదాలని తెలిపాడు. సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ ఓ పొలిటీషియన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more