బాహుబలి లో చిరు ఇన్ వాల్వ్ మెంట్ .. రాజమౌళి ఏమంటున్నాడంటే... | Rajamouli says No Megastar's involvement in Baahubali.

No chiranjeevi voice over for baahubali 2

Director Rajamouli, Rajamouli Chiranjeevi, Chiranjeevi Rajamouli, Baahubali Chiranjeevi, Baahubali 2 Voic-eover, Baahubali Chiranjeevi Voice-over, Chiru Voice-over, Rajamouli Mega Rumour, Baahubali Megastar, CHiranjeevi Baahubali, Prabhas Chiranjeevi

Director Rajamouli Denies Rumours On Megastar Chiranjeevi's voice over for Baahubali 2.

బాహుబలి-2 చిరు వాయిస్ ఓవర్ అబద్ధం: రాజమౌళి

Posted: 03/06/2017 12:54 PM IST
No chiranjeevi voice over for baahubali 2

ప్రెస్టేజియస్ ప్రాజెక్టు బాహుబలి-2 రిలీజ్ కు దగ్గర పడుతుంటే... లేని పోని పుకార్లు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు రాగా, తర్వాత అలాంటిదేం లేదని చిత్ర యూనిట్ తాపీగా స్పందించింది. ఇక ఈ మధ్య తన వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్న చిరు బాహుబలి-2 కోసం సాయం చేయబోతున్నాడన్న వార్త హైలెట్ అయ్యింది.

బాహుబలి-2 లో చిత్ర ప్రారంభంలో జరిగిన కథ వివరించేందుకు చిరు వాయిస్ ను రాజమౌళి ఉపయోగించబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. మరీ ముదరకముందే రంగంలోకి దిగిన రాజన్న ఓ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో స్వయంగా ఇప్పుడు రాజమౌళియే స్పందించాడు. బాహుబలి-2 కోసం చిరంజీవిగారు వాయిస్ ఓవర్ అబద్ధపు ప్రచారం అంటూ కొట్టి పడేశాడు. దీంతో మెగా వాయిస్ ఓ రూమర్ అని తేలిపోయింది.

 

ఇక ట్రైలర్ మరో వారంలో సందడి చేయబోతుందన్న ఒక్క వార్త మాత్రం అభిమానులకు కాస్త సంతోషం కలిగిస్తోంది. మరోవైపు ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి అంటూ వర్చువల్ రియాలిటీ పిక్చర్ ని సిద్ధం చేస్తూన్నాడు కూడా. ఇందులో దేశంలో మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ కేరక్టర్ ను పోషిస్తోంది .. పెళ్లిచూపులు హీరోయిన్ రీతూ వర్మ. ‘‘ఈ వీఆర్ ఫిలిం కోసం నన్ను సంప్రదించారు. నాకు దాని సాంకేతికత ఏమీ తెలీదు. అయినా సరే బాహుబలి లాంటి ప్రపంచంలో భాగం అయినందుకు.. అందులోనూ రాజమౌళి సార్ తో పని చేస్తుందన్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది.

 Ritu Varma Baahubali Virtual Reality Character

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Voice-over  Baahubali-2  Director Rajamouli  Rumour  

Other Articles

Today on Telugu Wishesh