శ్రీమంతుడు కాపీ క్యాట్.. ఇంకా తేలలేదు బాస్ | Srimanthudu got relief from Court Summons.

Mahesh get relief in srimanthudu case

Srimanthudu Copy Story, Srimanthudu Case, Srimanthudu Summons, Srimanthudu Relief, Mahesh Babu Court Relief, Srimanthudu Copy Case, Sharat Chandra Mahesh Babu, Chachentha Prema Srimanthudu, Koratala Siva Mahesh Babu Court

Mahesh Babu, Srimanthudu makers issued court summons for copyright. Sharat Chandra had sought action under the Copyrights Act. But Court Hold that orders now.

శ్రీమంతుడి కేసులో మహేష్ కు ఊరట

Posted: 03/03/2017 09:02 AM IST
Mahesh get relief in srimanthudu case

టాలీవుడ్ రికార్డుల చరిత్రలో  శ్రీమంతుడు సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డును చెరిపి టాప్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో ఆ మధ్య ఓ వివాదం మూటగట్టుకుంది. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇప్పుడు అందులో నటుడు మహేష్ బాబుకు కాస్త ఊరట లభించింది.

గత నెల 24న నాంపల్లి కోర్టు నటుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివను కోర్టు కు హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా వాటిని నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని, కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో రచయిత శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్ జే కోర్టు, నటుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, తదితరులకు సమన్లు జారీ చేసింది.

దీనిని సవాల్ చేస్తూ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, దర్శకుడు కొరటాల శివ వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ వ్యాజ్యాలపై ఆయా న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ శంకర నారాయణ, కింది కోర్టు జారీ చేసిన సమన్లు నిలిపివేయాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Copy Story  Mahesh Babu  

Other Articles