జబర్దస్త్ తో చెడు ఎక్కువే.. అయినా ఏం చేయలేం: హైకోర్టు HC takes serious view of Jabardasth Show.

High court comments on jabardasth show

Jabardasth Khatarnak Comedy Show, Jabardasth High Court, Jabardasth Show Case, Roja Naga Babu High Court, Naga Babu Roja Case, Jabardasth Show High Court, Jabardasth Show Relief, Jabardasth Comedy Show, Jabardasth Telugu Comedy Show, Jabardasth High Court Comments

Comedy show Jabardasth Khatarnak Comedy Show gets Huge relief. The popular ETV show got some respite from the Hyderabad High Court on Friday as it quashed a criminal case charging them of depicting the judiciary and the legal profession in poor light in one of its episodes. relief Providing to actress and MLA R K Roja, actor K Nagendra Babu, two anchors Rashmi & Anasuya and a host of others in the show, the court, however, advocated guidelines to regulate such shows.

‘జబర్దస్త్‌’ షోకి హైకోర్టులో ఊరట

Posted: 02/18/2017 07:57 AM IST
High court comments on jabardasth show

బుల్లితెరపై వచ్చే రియాలిటీ షోలు కేవలం వినోదం మాత్రమే కాదు, వివాదాలను కూడా అందిస్తున్నాయి. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ విషయంలో కూడా ఇది ఉంది. గతంలో చాలా సార్లు ఎంతో మంది మనోభావాలను దెబ్బ తీసేలా అందులోని కంటెస్టెంట్ లు వ్యవహరిస్తున్నారంటూ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే కామెడీలో వంద రకాలున్నాయని, అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమని ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. అదే సమయంలో స్కిట్‌ హద్దులు దాటినప్పుడు తాను హెచ్చరిస్తుంటానని కూడా చెప్పాడులేండి.

అయితే బూతు కంటెంట్ తో కూడుకుని ఉన్న జబర్దస్త్‌ వంటి కార్యక్రమాలపై చట్టపరంగా ఎటువంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదని, ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప ఇలాంటి వాటిని అడ్డుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు. 2014 జూలై 10న జబర్దస్త్‌ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఓ స్కిట్‌ను ప్రదర్శించారంటూ సదరు కార్యక్రమం న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతర కళాకారులపై న్యాయవాది వై.అరుణ్‌కుమార్‌ కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన జడ్జి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగ జార్చే కార్యక్రమాలను అడ్డుకోవడం కష్టసాధ్యమని చెబుతూ అనిర్ధిష్ట బృందాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావంటూ జబర్దస్త్‌ టీంపై దాఖలైన కేసును కొట్టేసింది. టీవీ కార్యక్రమాలు ముఖ్యంగా హాస్య ప్రధాన కార్యక్రమాలను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తుంటారు. కొద్దిపాటి అక్షరాస్యత ఉన్న వారు, నిరక్ష్యరాస్యులు, గ్రామీణ నేపథ్యం కలిగిన వారు ఆయా హాస్య ప్రధాన కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, న్యాయ వాదులను ఉద్దేశించి పలికే డైలాగులను బట్టి న్యాయ స్థానాల్లో కార్యకలాపాలు ఇలానే జరుగుతాయని నమ్మే అవకాశం ఉంది.

అటువంటి కార్యక్రమాలు సాధారణ ప్రజానీకం మనస్సుల్లో న్యాయ వ్యవస్థపై తప్పుడు అభి ప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదుల ప్రతిష్టకు, హుందాతనానికి భంగం కలుగుతుంది’ అని న్యాయస్థానం పేర్కొంది. ఇది ఒక్క ఈ విషయంలోనే కాదని, చాలా అంశాల పై కూడా ప్రభావం చూపుతుందని చెప్పిన కోర్టు చివరికి కేసును మాత్రం కొట్టేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ టీం సభ్యులకు ఊరటనిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth  Comedy Show  High Court  Comments  

Other Articles