కాస్ట్ లీ మూవీలో కమల్ కూతురు | Shruti Haasan Signs India's Costliest film.

Shruthi haasan in costly movie

Sundar C Sanghamitra, Sanghamitra Movie, Shruti Haasan Costly Movie, Shruti Haasan Sanghamitra, Sanghamitra Heroine, Sanghamitra Movie, Sanghamitra Movie Heroes, Shruti Haasan Sunder C Movie, Shruti Haasan 2017 Movies, Shruti Haasan Latest Movie

Tamil director Sundar C has already announced his ambitious project titled 'Sanghamitra'. To be made on Rs 400 Cr budget, this film has Tamil heroes Arya and Jayam Ravi on board. Shruti Haasan has now been roped in because of her popularity in Telugu, Tamil and Hindi film industries.

400 కోట్ల బడ్జెట్ మూవీలో శృతీహాసన్

Posted: 02/14/2017 01:44 PM IST
Shruthi haasan in costly movie

కెరీర్ కు వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా శృతీహాసన్ చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. మల్టీటాలెంటెడ్ అయిన ఈ బ్యూటీ తండ్రి పేరు చెప్పుకునే సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఆపై స్వశక్తితోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సెలక్టివ్ సినిమాలు చేస్తున్న ఆమె ఖాతాలో గత కొంతకాలంగా పెద్దగా హిట్లు లేవు కూడా. అయినప్పటికీ ఓ అవకాశం దక్కటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కోలీవుడ్ లో దర్శకుడు సి.సుందర్ ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీని తెరకెక్కించే యత్నాలు చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. విజయ్, మహేష్ బాటు లాంటి స్టార్ హీరోయిన్లతో చేయిద్దామని యత్నాలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆర్య, జయం రవిలతో ఆ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ఈ చిత్రానికి సంఘమిత్ర అనే టైటిల్ ఖరారు కాగా, త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ఇక ఇందులో ఓ నాయికగా శృతీహాసన్ ను తీసుకున్నట్లు సమాచారం. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాను ఐదు ప్రతిష్టాత్మక బ్యానర్లు నిర్మించబోతున్నాయి. తమిళ్ తోపాటు తెలుగులోనూ, మరోవైపు హిందీలోనూ శృతీకి క్రేజ్ ఉండటంతోనే ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తండ్రి కమల్ హాసన్ తో కలిసి శభాష్ నాయుడు మూవీ చేస్తున్నా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు హోల్డ్ లో ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రెండో సారి నటిస్తున్న శృతీ కాటమరాయుడు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో ఆమెకు అవకాశం లభించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Sunder C  Sanghamitra  Heroine  

Other Articles