ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ అంతలా అవమానించారా? | Lyricist insulted by Top Hero fans.

Lyricist anantha sriram about tollywood

Tollywood Top Hero Fans, Top Hero Fans insult, Lyricist Anantha Sriram, Lyricist Anantha Sriram Sensational Comments, Anantha Sriram Insult, Tollywood Cast Politics, Ananta Sriram Pawan Kalyan, Anantha Sriram Junior NTR

Tollywood Top Hero Fans insulted Young Lyricist Anantha Sriram before write songs for their movies.

టాలీవుడ్ లో కుల రాజకీయాల గురించి అనంత శ్రీరామ్

Posted: 02/13/2017 04:27 PM IST
Lyricist anantha sriram about tollywood

తమ హీరో గొప్పంటే లేదు తమ హీరోనే గొప్పంటూ ఫ్యాన్స్ కొట్టుకోవటం తరచూ మనం చూస్తుంటాం. పొరపాటున సినిమా ఫలితం తేడా వస్తే చాలూ సోషల్ మీడియాల్లో ఒకరి హీరో సినిమాపై మరోక హీరో అభిమానులు ట్రోల్స్ ఇప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. అగ్రహీరోలను సైతం వదలకుండా సెటైర్లు వేసుకోవటం ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి అభిమానం మాకొద్దు బాబోయ్ అని హీరోలు మొత్తుకుంటున్నప్పటికీ, వాళ్ల పైత్యం మాత్రం వాళ్లదే. అయితే ఆ ఎఫెక్ట్ సినిమా కోసం పని చేసే టెక్నిషియన్లపై కూడా ఎంతో కొంత పడుతుందంట...

అవును.. ఈ విషయాలను స్వయంగా చెబుతున్నాడు గేయ రచయిత అనంత శ్రీరామ్. ఇప్పుడున్న వాళ్లలో చాలా మంది త‌మ సామాజిక వర్గానికి చెందిన హీరోకి పాట‌లు రాయ‌ని పక్షంలో సుద్ధ వేస్ట్ అంటూ ఓ ట్యాగ్ లైన్ తగిలిస్తున్నారంటూ చెబుతున్నాడు. ఇండస్ట్రీలో సామాజిక వర్గ, కుల భేదాలు పెరిగిపోతున్నాయని చెప్పిన ఈ యువ రచయిత తనకు అలాంటి అవమానాలు ఎదురయ్యాయని వివరిస్తున్నాడు. జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌కి పాట రాయ‌నంత వ‌ర‌కు ఓ వ‌ర్గం వారు తనని పాపులర్ గీత రచయిత కాదని అన్నారని, ఒకానోక టైంలో తెగ తిట్టారని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు సుమారు 700 పాట‌లు రాశాక తనకు ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి టాప్ హీరో సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చిందని, అంతకు ముందు వరకు తనని ఆయన అభిమానులు కూడా గొప్ప గీత రచయిత కాదంటూ కామెంట్లు చేశాడని తెలిపాడు. తమ హీరోకి రాయ‌లేదు కాబట్టి నువ్వు పెద్ద గొప్పేం కాదంటూ వ్యాఖ్యలు చేయటం సరికాదన్న శ్రీరామ్, ఆ ధోరణి మారాల్సిన అవసరం ఉందంటూ తేల్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lyricist  Anantha Sriram  Tollywood Top Heroes  

Other Articles